సరైనోడు సినిమాతో బంపర్ సక్సెస్ కొట్టిన బోయపాటి శ్రీను ఆయన తలచుకుంటే స్టార్ హీరోలు సినిమా చేయడానికి సిద్ధం అంటారు. అలాంటిది ఇలాంటి ఈ సమయంలో బెల్లంకొండ శ్రీనివాస్ కి ఇచ్చిన మాటకోసం ఆయనతో సినిమా చేయడానికి ముందుకొచ్చాడు బోయపాటి... బెల్లంకొండ చేసిన స్పీడున్నోడు బాక్సాఫీసు వద్ద భారీ స్థాయిలో నష్టాలను చవిచూసిన విషయం తెలిసిందే. దీంతో తన తప్పులు తెలుసుకున్న బోయపాటి ఈ సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లుగా తెలుస్తుంది. అందులో భాగంగా సరైన విలన్ పాత్రకోసం వెతుకులాట మొదలెట్టాడు. విలన్ కి ఎవరైతే సెట్ అవుతారా అన్న విషయంలో శ్రీకాంత్, రాజశేఖర్ వంటి సీనియర్ నటులను కూడా పరిశీలిస్తున్నట్లు తెలుస్తుంది. అయితే ఈ చిత్రంలో విలన్ ఎవరున్నప్పటికీ.. మరో రెండు కీలకమైన పాత్రల్లో సరైన వారిని ఎంపిక చేసినట్లు కూడా వార్తలు అందుతున్నాయి. ఆ ఇద్దరు కథానాయకులకు బోయపాటి అప్పుడే మాట ఇచ్చినట్లు కూడా తెలుస్తుంది. వారెవరు అన్నది త్వరలోనే తెలిసే అవకాశం ఉందన్నది సమాచారం. కాగా బోయపాటి, బెల్లంకొండ శ్రీనివాస్ చిత్రం ఈ మధ్యనే లాంఛనంగా ప్రారంభించిన విషయం తెలిసిందే. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. ఇంకా ఈ చిత్రానికి కథానాయికగా రకుల్ ప్రీత్ సింగ్‌ని కూడా ఎంచుకొన్నవిషయం తెలిసిందే.