Advertisement

నల్లధనంపై బిచ్చగాడు-2 రాబోతుంది..!


చిన్న సినిమాగా సైలెంట్ గా విడుదలై కలెక్షన్ల సునామి సృష్టించిన సినిమా బిచ్చగాడు. ఈ సినిమా ఎటువంటి ప్రచార ఆర్భాటాలు లేకుండా విడుదలై సంచలనం క్రియేట్ చేసింది. మౌత్ టాక్ తో మాత్రమే వందరోజులు విజయవంతంగా ఆడిన ఈ చిత్రం ఈ మధ్యకాలంలో బిచ్చగాడు అనే చెప్పాలి. ఈ చిత్రం చేసిన కలెక్షన్లకు బడా నిర్మాతలను సైతం ఆశ్చర్యానికి గురి చేసింది. కాగా ఈ చిత్రంలో హీరోగా నటించిన విజయ్ ఆంటోనికి టాలీవుడ్ లో మంచి పేరు రావడమే కాకుండా మాస్ లో విపరీతమైన క్రేజ్ కూడా సొంతమైంది. 

Advertisement

అయితే స్వతహాగా సంగీత దర్శకుడైన విజయ్ ఆంటోనీ, ఈ చిత్రంలోని పాటలు కూడా సూపర్ హిట్ కావడంతో మంచి పేరు వచ్చింది. దాంతో బిచ్చగాడు సీక్వెల్ తీసేందుకు ముమ్మరంగా ప్రయత్నిస్తున్నాడు విజయ్ ఆంటోని. అయితే బిచ్చగాడు-2 చిత్రానికి సంబంధించి ఫ్రీప్రొడక్షన్ పనులు కూడా వేగవంతంగా జరుగుతున్నాయని టాక్ నడుస్తుంది. ప్రధానంగా బిచ్చగాడు-2లో నల్లధనం అంశంపై తెరకెక్కించాలనుకుంటున్నట్లు తెలుస్తుంది. కాగా దేశం మొత్తంలో పెద్ద నోట్ల రద్దు చేయడంతో భారతదేశ ప్రజలందరిలో నల్లధనం అంశం హాట్ టాపిక్ గా మారింది. అందుకనే నల్లధనం,పెద్జ నోట్ల రద్దు తర్వాత జరుగుతున్న పరిణామాలపై ఈ చిత్రం ప్రధానంగా ఉండబోతుందంటూ వెల్లడౌతుంది. అయితే బిచ్చగాడు బాగా కలెక్షన్ చేయడంతో బిచ్చగాడు-2 ని భారీ బడ్జెట్ తో దాదాపు రూ.50 కోట్లతో తెరకెక్కించాలని చిత్రబృందం భావిస్తున్నట్లు  తెలుస్తుంది.అంతే కాకుండా ఈ సినిమాని తెలుగు, తమిళంలో డైరెక్టు మార్కెట్ ఉన్న విజయ్ ఆంటోనికి మలయాళం, కన్నడంలో కూడా విడుదల చేసే ప్లాన్ లో ఉన్నట్లు తెలుస్తుంది.

Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement