ధృవ సినిమా రిలీజ్ కి దగ్గర పడుతుంది. ఈ చిత్రం సురేంద్ర రెడ్డి డైరెక్షన్ లో తెరకెక్కుతుండగా రామ్ చరణ్, రకుల్ ప్రీత్ సింగ్ జోడిగా నటిస్తున్నారు. ఇక ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్నందువల్ల రామ్ చరణ్ మరియు ధ్రువ యూనిట్ సభ్యులు పబ్లిసిటీ పనుల్లో బిజీ అయిపోయారు. ఇక ఆడియో మొన్ననే నేరుగా మార్కెట్లోకొచ్చేసింది. కొన్ని వీడియో సాంగ్స్ బిట్స్ ని కూడా రిలీజ్ చేశారు ధృవ చిత్ర యూనిట్ వాళ్ళు. ఇక సాంగ్స్ లో చరణ్, రకుల్ ప్రీత్ డాన్సుతో రచ్చ రచ్చ చేసేసారు. చెర్రీ డాన్స్ మాత్రం ఇరగదీసేసాడు.
ఇక ధృవ చిత్రానికి సంబంధించి చూసా... చూసా... సాంగ్ మేకింగ్ ని నిన్న యూనిట్ వాళ్ళు విడుదల చేశారు. ఈ సాంగ్ ని కాశ్మీర్ వంటి ప్రాంతాలలో తెరకెక్కించారు. ఈ మేకింగ్ వీడియో లో రామ్ చరణ్ సురేంద్ర రెడ్డి కొడుకుతో చేసిన అల్లరి దగ్గరనుండి అందమైన లొకేషన్స్ ని చూపించారు. ఇక రామ్ చరణ్, రకుల్ పోటా పోటీ సందడి అంత ఈ మేకింగ్ లో చూపించి సినిమా మీద అంచనాలు పెరిగేలా చూసారు.
ఇక ఈ వీడియో చూసిన దగ్గరనుండి మెగా ఫాన్స్... రామ్ చరణ్ ధృవ చిత్రాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామానే క్యూరియాసిటీ తో వున్నారు. ఈ చిత్రం డిసెంబర్ 2 వ తేదీ విడుదల తేదీ ప్రకటించి ఈ నెల 20 న ప్రీ రిలీజ్ ఫంక్షన్ ని వరంగల్ లో గ్రాండ్ గా చేసేందుకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.