నాని డిఫ్రెంట్, డిఫరెంట్ మూవీస్ తో రెచ్చిపోయి హిట్స్ కొడుతున్నాడు. బాగా సుడి తిరిగి అదృష్టాన్ని జేబులో వేసుకుని తిరుగుతున్న నాని ఇప్పుడు మరో హిట్ కొట్టాలని రెడీ అవుతున్నాడు. 'నేను లోకల్' అంటూ... హీరోయిన్ కీర్తి సురేష్ తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు. ఈ సినిమాని దిల్ రాజు సమర్పిస్తున్నాడు. త్రినాధ్ రావు దర్శకత్వం లో రూపుదిద్దుకుంటున్న 'నేను లోకల్' చిత్రం వచ్చే క్రిష్ట్మస్ కానుకగా విడుదల చెయ్యడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే ఈ సినిమాకి సంబంధించిన టీజర్ ని చిత్ర యూనిట్ తాజాగా విడుదల చేసింది. ఈ టీజర్ లో నాని, కీర్తి సురేష్ తో చేసే రొమాంటిక్ సీన్ అదిరిపోయింది. కీర్తి తో సైగలు చేస్తూ నాని చేసిన రొమాంటిక్ సన్నివేశం ఈ టీజర్ లో కళ్లకు కట్టినట్లు చూపించి ఈ సినిమాపై అంచనాలు పెంచేసాడు. ఈ టీజర్ లో కీర్తి తన డ్రెస్ బావుందా.... అని నానిని అడుగుతుంది. దానికి నాని ఒక ముద్దు పెట్టమని సైగలతో అడగగా నానిని చెంప పగులుద్ది అని సైగతో సమాధానమిచ్చిన కీర్తి ని... పక్కకి రమ్మని సైగలతో పిలుస్తూ ఉంటాడు నాని. ఆ సన్నివేశం లో నానిని, కీర్తిని చూస్తే మాత్రం నాని ఈసారి గ్యారెంటీ హిట్ ఖాయమనే మాట వినిపిస్తుంది. ఇప్పటికే మినిమమ్ గ్యారెంటీ హీరోగా దూసుకుపోతున్న నాని ఈసారి కీర్తి సురేష్ తో కలిసి 'పక్కా' హిట్ కొట్టడానికి పూర్తి నమ్మకంతో వచ్చేస్తున్నాడు.