Advertisement
Google Ads BL

నేడు అదే గతి...భారీ నిర్మాతలే గుర్తించాలి.!


ప్రధాని మోడీ తీసుకున్న రూ.500, రూ.1000ల రద్దుపై బాలీవుడ్‌ హీరోలతో పాటు టాలీవుడ్‌ హీరోలు కూడా హర్షం వెలిబుచ్చుతున్నారు. కానీ దర్శకనిర్మాతలు మాత్రం ఆ మాటే ఎత్తడం లేదు. అయితే ఈ నిర్ణయం కోట్లకు కోట్లు రెమ్యూనరేషన్స్‌ తీసుకునే స్టార్‌హీరోలకు పెద్ద షాక్‌ అవుతుందని ఎక్కువ మంది భావించారు. కానీ ఈ ఎఫెక్ట్‌ స్టార్‌లను కాకుండా ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న మీడియం బడ్జెట్‌ హీరోలు, ప్రతి విజయం వచ్చిన ప్రతిసారి రెమ్యూనరేషన్‌ను విపరీతంగా పెంచివేసే హీరోలకు ఎక్కువగా ఇబ్బంది కలిగిస్తోంది. కాగా డిస్ట్రిబ్యూటర్ల విషయానికి వస్తే వారు ఈ నిర్ణయాన్ని ఎంతగానో స్వాగతిస్తున్నారు. దీనికి కారణం ఇటీవల భారీగా పెరిగిన డిస్ట్రిబ్యూషన్‌ హక్కుల వల్లే అనేది వాస్తవం. ప్రస్తుతం స్టార్‌ హీరోలు భారీ భారీ బడ్జెట్‌ చిత్రాలు చేస్తున్నారు. దానికి తగ్గట్లుగానే మన నిర్మాతలు మరింతగా క్రేజ్‌ను బట్టి ఆ సినిమా విడుదల సమయంలో రేట్లు భారీగా పెంచేస్తున్నారు.ఇక విషయానికి వస్తే ఈ మధ్య కాలంలో రజనీకాంత్‌ అన్ని ఇండస్ట్రీలకు ఓ మెసేజ్‌ను ఇన్‌డైరెక్ట్‌గా ఇచ్చాడు. తమ బయ్యర్లు భారీ ధరలకు కొన్న చిత్రాలు ఫడేల్‌ మని బాక్సాఫీస్‌ వద్ద బోల్తా కొడితే తాము తీసుకున్న రెమ్యూనరేషన్‌ను తిరిగి తాము ఎంతో కొంత తిరిగి ఇవ్వడమే కాకుండా ఆ మేరకు నిర్మాతలు కూడా తాము అమ్మిన రేటులో, ప్రీరిలీజ్‌ పరంగా ముందుగా వచ్చిన లాభాల్లో కొంత శాతాన్ని నిర్మాతల చేత బయ్యర్లకు, డిస్ట్రిబ్యూటర్లకు ఇప్పిస్తున్నారు. దీంతో భారీ బడ్జెట్‌ చిత్రాల డిస్ట్రిబ్యూటర్లు, బయ్యర్లు తాము ఓ భారీ బడ్జెట్‌ సినిమాను కొనేటప్పుడు తాము అందుకోసం నిర్మాతలకు కట్టే మొత్తాన్ని కేవలం వైట్‌లోనే అంటే చెక్కుల ద్వారానే ఇస్తున్నారు. దీనివల్ల తమకు ఆ చిత్రం వల్ల ఎంత నష్టం వచ్చింది అనే దానికి చెక్‌ ద్వారా వైట్‌గా ఇస్తేనే నష్టపరిహారానికి తగిన ఆధారంగా ఈ చెక్‌లను డిస్ట్రిబ్యూటర్లు, బయ్యర్లు భావిస్తున్నారు. ఇక రజనీ నడిచిన బాటలో టాలీవుడ్‌లో కూడా పవన్‌కళ్యాణ్‌, మహేష్‌బాబు వంటి స్టార్లు నైతిక బాధ్యతగా, తమ తదుపరి కెరీర్‌కు చెడ్డపేరు రాకుండా భరోసా కల్పించేందుకు ఈ విధానాన్ని తమ నిర్మాతల చేత ఒప్పిస్తున్నారు. కానీ రజనీ, పవన్‌లు ఈ విధంగా నష్టపరిహారం స్వచ్చందంగా చెల్లించి, నిర్మాతలను కూడా అదే బాటలో నడవాలని నిర్ణయించుకున్నప్పుడు ఇది చాలా విషసంస్కృతి అని, లాభాలు వస్తే మాకేమైనా ఎక్కువ డబ్బులు ఇస్తున్నారా? మరి నష్టాలొచ్చినప్పుడు నిర్మాతలు ఎందుకు స్పందించాలి? దానికి హీరోను నిందించడం ఎంత వరకు సబబు అంటూ నీతి వాక్యాలు చెప్పారు. కానీ ఇప్పుడు రజనీ, పవన్‌లు చూపిన మార్గమే ఉత్తమమైన మార్గమని డిస్ట్రిబ్యూటర్లు ఈ పద్దతి ఫాలో అయిన స్టార్స్‌కు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నారు.

Advertisement
CJ Advs
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs