Advertisement
Google Ads BL

కమల్ హాసన్ కూతురికి బెదిరింపులు!!


సెలబ్రిటీస్ ఈ మధ్య సోషల్ మీడియాలో చాలా చురుకుగా స్పందిస్తున్నారు. ఇక సోషల్ మీడియాలో సెలబ్రిటీస్ ఎప్పటికప్పుడు తమ సినిమాల అప్ డేట్స్ తో పాటు తమ పర్సనల్  విషయాలను కూడా తమ అభిమానులతో పంచుకుంటూ ఆనందపడుతుంటారు. అలాంటి సమయంలో సెలబ్రిటీస్ ల అకౌంట్స్ ని కొంతమంది ఆకతాయిలు హాక్ చేసి స్టార్స్ ని ఇబ్బందుల్లో పడేస్తుంటారు. కొన్నిసార్లు స్టార్స్ వెంటనే కనిపెట్టి తమ అకౌంట్స్ హాక్ అయ్యాయని అందులో పోస్ట్ చేసే వాటికి తమకేమీ సంబంధం లేదని వివరణ ఇస్తుంటారు కూడాను. వీటివల్ల కొంతమంది సెలబ్రిటీస్ అయితే మనకెందుకులే అవన్నీ అని వదిలేస్తారు.

Advertisement
CJ Advs

అసలిప్పుడు ఇవన్నీ మాట్లాడుకోవడానికి ఒక విషయం వుంది. అదేమిటంటే టాలీవుడ్, కోలీవుడ్ లలో వరుస సినిమాలతో బిజీగా వున్న శృతి హాసన్ ని చంపుతామంటున్నారట. ఎవరో ఏమిటో తెలియదు గాని శృతిని చంపుతామంటూ బెదిరింపులకు పాల్పడుతున్నాడట. శృతి హాసన్ కి ఈ బెదిరింపులు గత సెప్టెంబర్ నుండే మొదలయ్యాయట. శృతి హాసన్ అధికారిక ట్విట్టర్ అకౌంట్ లో కేజీ గురుప్రసాద్ అనే డాక్టర్ శృతిని చంపుతానంటూ మెస్సేజ్ లు పెడుతున్నాడు. చెప్పడానికి వీలులేని పదాలతో శృతి హాసన్ ని దూషిస్తూ పోస్ట్ చేస్తున్నాడట. అలా చాలా రకాలుగా కేజీ గురుప్రసాద్ శృతిని ఇబ్బందులకు గురిచేస్తున్నాడట.

ఇక వీటిని భరించలేని శృతి తన మేనేజర్ తో కలిసి పోలీస్ లకి ఫిర్యాదు చేసిందట. అక్కడ శృతి దాదాపు రెండు పేజీల కంప్లైంటుని పోలీసులకు అందజేసిందని సమాచారం. ఇక ఈ ఫిర్యాదుతో అలర్ట్ అయిన పోలీసులు ఆ డాక్టర్ ని వెతికే పనిలో పడ్డారట. అయితే శృతి హాసన్ పై ఇంతకుముందు కూడా ఒక దుండగుడు దాడికి పాల్పడ్డాడు. మరి ఆ దుండగుడు ఈ డాక్టరు ఒక్కరేనా అనే కోణంలో కూడా పోలీస్ లు విచారణ జరుపుతున్నారు.

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs