గత రెండు రోజులుగా మీడియాలో, సోషల్ మీడియాలో మోడీ పెద్దనోట్ల రద్దు ప్రకటనపై ఒకటే రచ్చ జరుగుతుంది. ఇక సినిమా పరిశ్రమ వాళ్ళు కొంతమంది మోడీ నిర్ణయాన్ని సమర్ధిస్తూ రకరకాల ట్వీట్స్ తో సోషల్ మీడియాలో యాక్టీవ్ గా వున్నారు. మరికొందరు స్టార్స్ అయితే అసలు మోడీగారి ప్రకటనకు బాధపడుతున్నారో... లేక ఆనందిస్తున్నారో... తెలియడం లేదు. అసలు రజినీకాంత్ దగ్గర నుండి.... కమల్ హాసన్ వరకు మోడీ గారిని ప్రశంసలతో ముంచెత్తుతుంటే ఇక్కడ టాలీవుడ్ బడా హీరోలు మాత్రం మోడీ ప్రకటనపై స్పందించకపోవడం పెద్ద చర్చనీయాంశమైంది.
ఇక టాలీవుడ్ లో నిర్మాతలైతే కక్కలేక మింగలేక కొట్టుమిట్టాడుతుంటే.... కొంతమంది డైరెక్టర్స్.... చిన్న హీరోల సైతం మోడీ ప్రకటనకు తమ స్టయిల్లో స్పందించారు. మోడీ తీసుకున్న ఈ నిర్ణయం సూపర్ గా ఉందని కొంతమంది సమర్ధించారు. ఇక చిరంజీవి, వెంకటేష్, ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్ వంటి వాళ్ళు మోడీప్రకటనకు నోరు మెదపలేదు.
అయితే తాజాగా సోషల్ మీడియాలో మహేష్ ఒక పోస్ట్ చేసాడు. మహేష్ ఎక్కువగా సోషల్ మీడియాలో పెద్ద యాక్టీవ్ గా ఉండడు. ఎప్పుడూ మహేష్ ఫేస్ బుక్ మరియు ట్విట్టెర్స్ ని మహేష్ భార్య నమ్రతానే హ్యాండిల్ చేస్తుందని అంటూ వుంటారు. అయితే ఈ మధ్యన మహేష్ కూడా కొంచెం తన సోషల్ మీడియాలో స్పందిస్తున్నాడు. ఆ మధ్యన ఎప్పుడో తాను తీసుకున్న దత్త గ్రామ గురించి... దాని అభివృద్ధి పనుల గురించి ముచ్చటించాడు. అలాగే తన బావ గల్లా జయదేవ్ కూడా దత్తత గ్రామానికి ఎంపీ నిధులు ఖర్చుపెట్టి సహాయం చేసాడని... అందుకు థాంక్స్ అని పోస్ట్ చేసాడు.
ఇక ఇప్పుడు మోడీ ప్రకటనకు మహేష్ చాలా లేట్ గా స్పందించినా లేటెస్ట్ గా స్పందించాడు. మహేష్ మోడీని ఉద్దేశించి 'దేశానికి దేశ ఆర్ధిక వ్యవస్థకు ఒక ఆహ్లాదకరమైన మార్పును తీసుకువచ్చారు.. ప్రజల మనిషి - ప్రజల కొరకు - ప్రజల చేత ఎన్నుకోబడిన నరేంద్ర మోడీ గారు ఇచ్చిన మాస్టర్ స్ట్రోక్ కు హాట్స్ హాఫ్' అంటూ పోస్ట్ చేసి అందరిని ఆశ్చర్యచకితుల్ని చేసేసాడు. అసలు మహేష్ ఆ ప్రకటనపై స్పందించడమే ఒక పెద్ద విషయమైతే మోడీ ని పొగిడి శభాష్ అనిపించుకున్నాడు.
Advertisement
CJ Advs