Advertisement
Google Ads BL

తాము విడిపోవడానికి కారణం వాళ్ళే కాదట.!


సీనియర్ నటి గౌతమి, ఇంటర్నేషనల్ హీరో కమలహాసన్ నుంచి విడిపోతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.  గౌతమి అలా ప్రకటించిందో లేదో వారి బ్రేకప్ కు కారణం శృతి హాసన్, రమ్యకృష్ణ అంటూ పలువురు పలు రకాలుగా కామెంట్లు చేశారు. ఏది ఏమైనా... గౌతమి, కమలహాసన్ కలిసి సుమారు 13 ఏళ్ల పాటు సహజీవనం చేసి ఇలా హఠాత్తుగా విడిపోవడం అన్నది బాధాకరమే.  వారిద్దరూ ఒకరికొకరు దూరం కావడానికి అసలు మెయిన్ రీజన్ ఏమిటన్నది మాత్రం ఇప్పటికి అంతుపట్టని మిస్టరిగానే అందరినీ తొలిచివేస్తుంది. అయితే కమలహాసన్, గౌతమి ఇద్దరూ విడిపోవడానికి నటి శ్రుతీహాసన్, అక్షరహాసన్‌లే కారణమనీ, తన తండ్రి కమలహాసన్, గౌతమితో సహజీవనం చేయడం వారిద్దరికీ ఇష్టం లేదని అందుకే చిన్న చిన్న గొడవలు అంతర్గతంగా పెద్ద గొడవలకు దారి తీసి అలా వారిద్దరూ విడిపోవాలన్న నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు. లేకపోతే ఇద్దరూ ఒకరికొకరు తోడూ నీడగా ఉండాల్సిన ఈ సమయంలో విడిపోవడం ఏంటనే రూమర్లు కూడా బాగా చక్కర్లు కొడుతున్నాయి. 

Advertisement
CJ Advs

మొత్తానికి ఆనోటా ఈనోటా పడి ఈ ప్రచారం ఈ మధ్య గౌతమి చెవిన పడినట్లుగానే ఉంది. అందుకనే ఈ మధ్య జరిగిన ఓ బేటీలో తామిద్దరం విడిపోవడానికి కమలహాసన్ కూతుళ్లు శ్రుతీహసన్, అక్షరహాసన్‌లు కారణం కాదనీ గౌతమి వెల్లడించింది. ఇంకా ఈ సందర్భంగా గౌతమి మాట్లాడుతూ... తాను కూడా సమాజంలో ఒక సెలబ్రిటిగానే జీవినం సాగిస్తున్నానని, కాబట్టి ఇలాంటి సమయంలో  తన జీవితంలోని ప్రతి విషయాన్ని బహిరంగ పరచాల్సిన బాధ్యత తనపై ఎంతైనా ఉందని గౌతమి అన్నది. తాను16 ఏట నుంచే నటిగా రంగప్రవేశం చేశాననీ, స్వతంత్రమైన ఆలోచనలు, స్వయం కృషితోనే తాను ఈ స్థాయికి చేరుకున్నానన్నది గౌతమి. ఇంకా గౌతమి మాట్లాడుతూ.. జీవితంలో ఎప్పటికప్పుడు మార్పును ఆహ్వానించేవారు, కొన్ని సమస్యలను ధైర్యంగా ఎదుర్కోవాల్సి వస్తుందని ఆమె అన్నది. ఇప్పుడున్న పరిస్థితుల్లో తన కూతురు భవిష్యత్తు తనకు చాలా ముఖ్యమని, ఈ విషయం కూడా కమలహాసన్ నుండి తాను దూరం కావడానికి కారణం అని చెప్పవచ్చు అన్నది గౌతమి. అయితే మొత్తానికి వారి బ్రేకప్ వెనుక చాలా కారణాలున్నాయన్న మాట.  

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs