Advertisement
Google Ads BL

పవన్ శక్తిని చూపేందుకు ఆ దర్శకుడి ప్లాన్..!


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో హ్యాట్రిక్ సినిమా ఈ మధ్యే ప్రారంభోత్సవం జరుపుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాను 2017 ఆగష్టు 15వ తేదీ విడుదల చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తుంది. పవన్ కళ్యాణ్- త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో వస్తున్న ఈ చిత్రం షూటింగ్ డిసెంబర్ నెలాఖరులో గానీ, జనవరి మొదటి వారంలో గానీ మొదలు కానుంది. అందుకని దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఏకాగ్రత అంతా సినిమా స్క్రిప్టుపైనే పెట్టినట్లు తెలుస్తుంది. అయితే ఇంత పాస్ట్ గా పవన్ కళ్యాణ్ ఈ సమయంలో త్రివిక్రమ్ తో ఎందుకు సినిమా తీస్తున్నట్లు అని పిల్మ్ సర్కిల్స్ లో చర్చోపచర్చలు సాగుతున్నాయి. అంతేకాకుండా పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కు ఓ లైన్ ఇచ్చి దానిపై పకడ్బందీగా కథను తయారు చేయమని చెప్పినట్లు కూడా తెలుస్తుంది. కాగా అందుకు సంబంధించి బలంగా పవన్ లైన్ ను రూపొందించే పనిలో త్రివిక్రమ్ తలమునకలౌతున్నట్లు కూడా తెలుస్తుంది. 

Advertisement
CJ Advs

కాగా పవన్ ప్రస్తుతమున్న పరిస్థితులకు అనుగుణంగా రాజకీయంగా కూడా బలమైన నేతగా మారేందుకు ప్రజల్లో పవన్ కు రాజకీయ ఇమేజ్ ను సొంతం చేసుకొనేలా అందుకు తగిన కథను రూపొందిస్తున్నట్లు తెలుస్తుంది. పేదరికం, అవినీతి వీటిని ప్రధానంగా గురిపెట్టి త్రివిక్రమ్ కథను రూపొందిస్తున్నట్లు తెలుస్తున్న సారాంశం. అయితే పవనే స్వయంగా చెప్పిన ఈ కథను మెరుగులు దిద్దుతూ అందుకు తగిన మసాలాలు, కల్పనలు అతికిస్తూ, పక్కా పాలటిక్స్ లో ఓ విప్లవాన్ని క్రియేట్ చేసేలా ఉండబపోతుందన్నది మాత్రం వాస్తవంగా తెలుస్తుంది. అయితే ఈ క్రమంలోనే త్రివిక్రమ్ కి పవన్ కి మంచి సంబంధాలు ఉన్నవని గతంలో కూడా చాలా పుకార్లు వినిపించాయి. అసలు పవన్ సభలన్నింటికీ త్రివిక్రమే స్క్రిప్టు ప్రిపేర్ చేసిస్తాడని కూడా వెల్లడౌతున్న పుకార్లు. కాగా పవన్ ను రాజకీయంగా కూడా శక్తిమంతుడిని చేసేందుకు త్రివిక్రమ్ తెగ కృషి చేస్తూ అందుకు పటిష్టంగా స్క్రిప్టు చెక్కుతున్నాడని కూడా అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తుంది. 

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs