Advertisement
Google Ads BL

అంబానీ కొడుకుతో కత్రినా కొత్త షికారు..!


బాలీవుడ్ హాట్ భామ కత్రినా కైఫ్ ఎఫైర్స్ గురించి చెప్పక్కర్లేదు. అప్పట్లో బాలీవుడ్ నటుడు రణబీర్ కపూర్‌తో ప్రేమాయణం సాగించిన ఈ భామ.. ఆ తర్వాత ఇద్దరి మధ్య బ్రేకప్‌ పడింది.  ఆ రకంగా అప్పట్లో సంచలనం రేపిన ఆమెగారి ప్రేమ మరోసారి ఇప్పుడు వార్తల్లోని వ్యక్తిగా మారిపోయింది. తాజాగా కత్రినా కైఫ్.. రిలయన్స్ సంస్థల అధినేత ముకేశ్ అంబానీ కుమారుడు  ఆకాశ్ అంబానీతో చెట్టపట్టాలేసుకొని తిరుగుతున్నట్లుగా ఒక్కసారి వార్తలు గుప్పుమంటున్నాయి. ఈ మధ్య ముంబైలో జరిగే ఏ ఫంక్షన్లు, పార్టీలకైనా వీరిద్దరూ కలిసి వెళ్తుండటంతో ఈ విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. రణబీర్‌ కపూర్ తో కత్రినా కైఫ్ బ్రేకప్ జరిగిన తర్వాత ఆకాశ్‌తో కత్రినా డేటింగ్ చేస్తున్నట్లు వారిద్దరి వ్యవహారాన్ని బట్టి తెలుస్తుంది.

Advertisement
CJ Advs

అయితే ఇలా అందరికీ అనుమానం రావడానికి కారణం కూడా ఉంది. మొన్న దీపావళి సందర్భంగా... బిగ్ బీ ఇంట్లో గ్రాండ్ పార్టీ జరిగింది. ఆ పార్టీ బిగ్ బీ అన్ని రంగాలకు చెందిన చాలా మంది ప్రముఖలను ఆహ్వానించాడు అమితాబ్ బచ్చన్. అంతే.. ఈ పార్టీకి ఆకాశ్ అంబానీతో కలిసి కత్రినా కైఫ్‌ ఒకే కారులో రావడం అందరినీ ఆకర్షించింది. కాగా అలా రావడం ఆమధ్య సంచలనం రేపింది. అలా ఇద్దరూ దొరికిపోవడంతో వారి మధ్య ఏదో నలుగుతుందని అంతా భావించారు. అంతే కాకుండా ఆ తర్వాత.. మరోసారి అనిల్ కపూర్ తన జుహు రెసిడెన్సీలో పార్టీకి అందరినీ ఆహ్వానించాడు. ఈ పార్టీకి కూడా వీరిద్దరూ కలిసి రావడంతో  ఆ ఇద్దరి మధ్య  ఎఫైర్ నడుస్తుందన్న భావన అందరిలోనూ కలుగింది. అయితే అక్కడ కత్రినాకు అనిల్ కపూర్ ఇచ్చిన కుందన్ జ్యువలరీ పెట్టుకొని చక్కనైన బొట్టు కట్టుతో కనిపించి అందరనీ ఆశ్చర్యపరచింది. ఇంకా అనిల్ కపూర్ పార్టీకి రణబీర్ కపూర్ కూడా రావడంతో కత్రినా కాస్త అతడికి కనపడకుండా మైంటైన్ చేసిందని కూడా టాక్ నడుస్తుంది. మొత్తానికి కత్రినా కొత్త షికారు మొదలెట్టిందన్న మాట.

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs