చిన్న, పెద్ద తేడా లేకుండా మోడీ ఇచ్చిన షాక్ కి తేరుకోలేక జనాలు అస్తవ్యస్త పరిస్థితుల్లో పడ్డారు. మోడీ కి సడన్ గా ఏం గుర్తొచ్చిందో గాని ఇలా 500, 1000 నోట్లని బ్యాన్ చేసి పడేసాడు. బ్లాక్ మనీని అరికట్టే ఆలోచనగా మోడీ ఈ పని చేసాడు. కానీ మోడీ చేసిన ఈ పని వల్ల ప్రతి ఒక్కరూ అంటే... ప్రతి ఒక్క పరిశ్రమ, చిరు వ్యాపారులు, సినిమా పరిశ్రమ ఒకటేమిటి ప్రతి ఒక్కదాన్ని తాకింది ఈ సెగ. అసలు సమయమే ఇవ్వకుండా మోడీ ఇంతటి నిర్ణయాన్ని కొన్ని గంటల సమయంలో అమలు చేసేసాడు. మోడీ నిర్ణయం అమలు కావడం మొదలెట్టినప్పటి నుండి 500, 1000 నోట్లు చెల్లకుండా పోయాయి. బ్యాంకు ద్వారా మార్చుకున్నప్పటికీ.... ఇప్పడు ప్రస్తుతానికి అవి మారక చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు.
ఇక ఈ సెగ సినిమా ఇండస్ట్రీ ని గట్టిగా తాకింది. ఇప్పుడసలే సినిమాలు విడుదలకి సిద్ధమవడం ఒకటైతే.... ప్రస్తుతం కొన్ని సినిమాలు షూటింగ్స్ జరుపుకుంటున్నాయి. ఆ సినిమాల షూటింగ్స్ లో కార్మికుల కనీస వేతనాలు ఇవ్వాలంటే కూడా ఈ 500 నోట్ల చెల్లుబాటు కాకపోవడం తో తీవ్ర ఇబ్బందులు తలెత్తే పరిస్థితులు వున్నాయి. దీనితో షూటింగ్స్ కి బ్రేక్ పడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరో పక్క రెండు మూడు సినిమాలు రేపు విడుదలకు సిద్ధమయ్యాయి. ఆ సినిమాలు విడుదల చెయ్యాలంటే డిస్ట్రిబ్యూటర్స్, నిర్మాతలకి తెచ్చి డబ్బులు కట్టేది సగం వరకు బ్లాక్ లోనే ఉంటుంది. ఇప్పుడు తెచ్చేపరిస్థితి లేదు. తీసుకునే పరిస్థితి లేదు. మరి ఆ సినిమాల విడుదల ఉంటుందా? లేదా? అనేది కూడా ఇప్పుడు ప్రస్తుతానికి సస్పెన్స్.
ఇక డిస్ట్రిబ్యూటర్స్ కూడా ప్రొడ్యూసర్స్ కి సంచులతో 500, 1000 నోట్ల కట్టలని తెచ్చే పద్దతి ఎప్పుడునుండో టాలీవుడ్ లో నడుస్తుంది. ఇక ఇప్పుడు మోడీ ఇచ్చిన ఈ ప్రకటనతో డిస్ట్రిబ్యూటర్స్ కూడా అయోమయం లో పడ్డారు. ఎందుకంటే 500, 1000 కట్టల్ని ఎలాగో గొనె సంచుల్లోవేసి మూటకట్టేవారు. మరి ఇప్పుడు వాటి స్థానం లో 100 కట్టల్ని తీసుకురావడానికి వారెన్ని ఇబ్బందులు పేస్ చెయ్యాల్సి వస్తుందో. ఇక ఇప్పుడు వారిదగ్గరున్న ఆ 500, 1000 నోట్లని మార్చడానికి కూడా నానా పాట్లు పడాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక డిస్ట్రిబ్యూటర్స్ పరిస్థితి అగమ్యగోచరంగా తయారయ్యిందనే చెప్పాలి. ఇక ఈ పరిణామాలన్నీ చూస్తుంటే సినిమా పరిశ్రమకి గడ్డు కాలం ఏర్పడిందనే చెప్పాలి.
ఏదైతేనేమి మోడీ ఒక ప్రకటన ఇప్పుడు ఇండియాని అతలాకుతలం చేసేసింది అనడానికి ఏం సందేహం లేదు!!