Advertisement
Google Ads BL

ధృవ పాటలు వచ్చేశాయ్...!


మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌, ర‌కుల్ ప్రీత్ సింగ్ జంట‌గా ప్ర‌తిష్టాత్మ‌క‌మైన  గీతాఆర్ట్స్ బ్యాన‌ర్ లో, స్టైలిష్ డైరెక్ట‌ర్ సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న స్ట‌యిలిష్ ఎంట‌ర్‌టైన‌ర్ `ధృవ` ఏస్ ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్‌, మ‌రో నిర్మాత ఎన్‌.వి.ప్ర‌సాద్  సంయుక్తంగా ఈ చిత్రాన్ని హై బ‌డ్జెట్‌, టెక్నిక‌ల్ వాల్యూస్‌తో ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాకుండా నిర్మిస్తున్నారు.

Advertisement
CJ Advs

హిప్ హాప్ ఆది సంగీతం అందించిన ఈ సినిమా పాట‌లు నేరుగా మార్కెట్లోకి విడుద‌లయ్యాయి. ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుద‌లై ట్రెండీ మ్యూజిక్‌తో ఉన్న ధృవ పాట‌ల‌కు ఆడియెన్స్  నుండి ట్రెమండ‌స్ రెస్పాన్స్ వ‌స్తున్నాయి. ప‌వ‌ర్‌ఫుల్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా రూపొందుతోన్న ఈ సినిమా ప్రేక్ష‌కులు, అభిమానుల్లో భారీ క్రేజ్ నెల‌కొంది.  అన్నీ కార్య‌క్ర‌మాల‌తో సినిమాను డిసెంబ‌ర్‌లో విడుద‌ల చేస్తున్నారు.

రాంచరణ్, రకుల్ ప్రీత్ సింగ్, అరవింద్ స్వామి, నాజర్, పోసాని కృష్ణ మురళి తదితరులు న‌టించిన ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫ‌ర్‌- పి.య‌స్‌.వినోద్‌, మ్యూజిక్ - హిప్ హాప్ ఆది,  ప్రొడక్షన్ డిజైనర్ - రాజీవన్, ఆర్ట్ - నాగేంద్ర, ఎడిటర్ - నవీన్ నూలి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - వి.వై. ప్రవీణ్ కుమార్, ప్రొడ్యూసర్స్ - అల్లు అరవింద్, ఎన్‌.వి.ప్ర‌సాద్‌, దర్శకుడు - సురేందర్ రెడ్డి.

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs