Advertisement
Google Ads BL

పెద్ద నోట్లపై వేటు... సినీ ప్రముఖులు ఏమన్నారంటే..!


భారత ప్రధాని నరేంద్రమోడీ మంగళవారం పెద్ద బాంబ్ పేల్చాడు. భారత చరిత్రలో ఎవరూ ఇంత సాహసానికి పూనుకోలేదు. మోడీ రూ.500. రూ.1000 నోట్లను రద్దు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. మోడీ జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తూ.. ఇక నుండి ఆ రెండు రకాలైన నోట్లను రద్దు చేస్తున్నట్టు ప్రకటించాడు. మంగళవారం అర్ధరాత్రి నుండే ఈ నోట్లు కేవలం కాగితాలు మాత్రమే అంటూ వెల్లడించాడు. ఇంకా ఈ నోట్లు విలువైనవే అంటూ ఈ కరెన్సీ నోట్లు ఉన్న ప్రజలు ఏమాత్రం ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటూ వెల్లడించాడు. అవి జాగ్రత్తగా పోస్ట్ ఆఫీసులలో గానీ, బ్యాంక్ లలో గానీ కొంత కొంత మార్చుకోవచ్చంటూ కాల పరిమితిని విధించాడు.

Advertisement
CJ Advs

కాగా రూ. 500, రూ.1000 నోట్లు ఉన్న ప్రజలు ఏం చేయాలంటే.... బుధవారం, గురువారం  ఏ బ్యాంకులు పనిచేయవు. అయితే ఆ తర్వాత మీవద్ద  ఉన్న రూ. 500, రూ. 1000 నోట్లను డిసెంబర్‌ 30, 2016లోపు బ్యాంకులు, పోస్టాఫీసులలో డిపాజిట్‌ చేసుకొనే సౌకర్యం కస్పించింది ప్రభుత్వం. ఈ నెల 24 వరకు హెడ్‌ పోస్టాఫీస్‌, సబ్‌ పోస్టాఫీస్‌లలో గుర్తింపు కార్డు చూపించి పాత రూ. 500, రూ. 1000 నోట్లను మార్చుకోవచ్చు.   ఇక్కడ రూ. 4,000 వరకే మార్చుకొనే అవకాశం ఉంది. నగదును తీసుకొనే విషయంలో ప్రస్తుతం రోజుకు రూ. 10వేలు, వారానికి రూ.20వేలు వరకే పరిమితింగా తీసుకోవచ్చు. ఆ తర్వాత ఇది పెరిగే అవకాశం ఉండవచ్చు. ఇంకా చెక్కులు, డిమాండ్‌ డ్రాఫ్ట్స్‌, డెబిట్‌, క్రెడిట్‌ కార్డుల ద్వారా చేసే చెల్లింపుల విషయంలోనూ, ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌ విషయంలోనూ ఎలాంటి పరిమితులు లేవు.

కాగా ప్రధాని నరేంద్రమోడీ తాజాగా రూ.500, రూ.1000 కరెన్సీ నోట్లను రద్దు చేసిన విషయం సంచలనానికి దారితీస్తుంది. దీనిపై సినిమా ప్రముఖులు కూడా స్వాగతించడం విశేషమనే చెప్పాలి.  మోడీ తీసుకున్న ఈ సాహసోపేతమైన నిర్ణయంపై అందరూ మోడీని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.

ముందుగా భారత ప్రధాని నరేంద్రమోడీ తీసుకున్న నిర్ణయానికి తమిళ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ స్వాగతిస్తూ.. మోడీకి హ్యాట్యప్ చెప్పాడు.  ఇప్పుడు నవీన భారత్‌ ఆవిర్భవించిందని ట్విట్టర్‌ ద్వారా వెల్లడించాడు.  ఇంకా అమితాబ్ బచ్చన్ మాట్లాడుతూ.. తాజాగా తాను చేసిన పింక్‌  చిత్రం కారణంగానే కొత్త 2 వేల రూపాయల నోటును  పింక్‌ రంగ్ తో ముద్రిస్తున్నారని చమత్కరించాడు. ఇంకా సినీనటుడు పరేశ్ రావల్ స్పందిస్తూ... నల్లధనం దాచుకున్న ఇప్పుడు తప్పుకుండా బయటపడతారని వెల్లడించాడు. అంతేకాకుండా.. దర్శకనిర్మాత మధుర్‌ భండార్కర్‌ మోడీ నిర్ణయానికి అబినందనలు తెలిపాడు. పెద్ద నోట్ల రద్దుతో నల్లధనం కచ్చితంగా బయటకు వస్తుందని చెప్పాడు.  దీంతో దేశ ఆర్థికవ్యవస్థ కూడా బలోపేతమవుతుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేశాడు. ప్రధాని తీసుకున్న నిర్ణయాన్నిప్రజలంతా సహృదయంతో స్వాగతించాలి. ఇండియాలోని ప్రతి పౌరుడి భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేసిందని హీరో అర్జున్ కపూర్‌ తెలిపాడు. భారత దేశ ప్రగతిని దృష్టిలో ఉంచుకొనే ప్రధాని మోడి తీసుకున్న సాహసోపేత నిర్ణయాన్ని స్వాగతించాలని బాలీవుడ్ హీరోయిన్‌ అనుష్క శర్మ వెల్లడించింది. ఇంకా టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ కూడా ప్రధాని సాహసోపేత నిర్ణయాన్ని స్వాగతించాడు.

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs