Advertisement
Google Ads BL

మెగా బ్రదర్స్ పై సమరం ప్రకటించాడు


టాలీవుడ్ ను ఓ రేంజ్ లో ఏలిన వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి. ఆ తర్వాత అంతే స్థాయిలో ఏలుతున్న వ్యక్తి అదే  ఫ్యామిలీ నుండి తమ్ముడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. కాగా మెగాస్టార్ సినిమాల నుండి కొంత కాలం విరామం తీసుకొని రాజకీయాల్లోకి ప్రవేశించి ప్రజారాజ్యం అని ఓ పార్టీ పెట్టి దాన్ని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ సందర్బంలో ప్రజారాజ్యం పార్టీ స్థాపించేప్పుడు చిరంజీవికి అండాదండగా పవన్ కళ్యాణ్ వ్యవహరించినా, ఆ తర్వాత పార్టీ విధానాలు నచ్చక పవన్ ప్రజారాజ్యానికి దూరంగా ఉన్న విషయం తెలిసిందే. అయితే అప్పట్లో ప్రజారాజ్యం పార్టీ ఎన్నికల్లో పోటీ చేసి అసెంబ్లీ సీట్లను అమ్మకున్నదనే విషయంపై పెద్ద దుమారమే రేగింది.
అయితే తాజాగా ప్రముఖ సెక్సాలజిస్ట్ డా. సమరం మెగాబ్రదర్స్ అయిన చిరంజీవి, పవన్ కళ్యాణ్ లపై విరుచుకు పడ్డాడు. ఇంతవరకు రాజకీయాల విషయంలో చిరంజీవి ఎవరైనా కాస్త కటువుగా విమర్శించినా పవన్ విషయంలో మాత్రం కాస్త ఆచి తూచి మాట్లాడతారు. అలాంటిది సమరం పవన్ కళ్యాణ్ ను కూడా ఏమాత్రం లెక్కచేయకుండా తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించాడు. విజయవాడలో జరిగిన ఓ కార్యక్రమంలో డా. సమరం మాట్లాడుతూ మెగాబ్రదర్స్ ను ఏకిపారేశాడు. డా. సమరం మాట్లాడుతూ... కాపులంతా చిరంజీవి వైపు ఉన్నప్పుడే కాపులను రాజకీయపరంగా డవలప్ చేయలేకపోయాడు చిరంజీవి. ఇక ఇప్పుడు కొత్తగా వచ్చిన ఈ పవన్ కళ్యాణ్ ఏం చేస్తాడు అన్నట్లు మండిపడ్డాడు సమరం. ఇంకా ప్రజారాజ్యం తరఫున ఒక్కో అసెంబ్లీ సీటును రూ. 3 కోట్ల నుండి రూ.5 కోట్ల వరకు అమ్ముకున్నాడని కూడా ఆరోపించి దుమారం రేపాడు. ఇవి ఇప్పుడు పొలిటికల్ సర్కిల్ లో సంచలనం రేపుతున్నాయి. ఇంకా అప్పట్లో అంతస్థాయిలో ఇమేజ్ ఉన్న చిరంజీవి ఏం చేయలేదు. పవన్ ఇంక ఏం చేయగలడు రాజకీయాలు అంటూ విరుచుకు పడ్డాడు. పవన్ అభిమానులు కేవలం ఈలలు వేసి గోల చేయడానికి మాత్రమే ఉపయోగపడతారు తప్ప రాజకీయంగా ఆయనకు ఏమాత్రం ఉపయోగపడరని కూడా జోస్యం చెప్పాడు.   

Advertisement
CJ Advs
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs