పూజా పద్దతి గల అమ్మాయేమి..కాదు..!


మిస్ ఇండియా అయిన పూజా హెగ్డే.. ముకుందా సినిమాలో పద్దతిగల అమ్మాయిగా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇక ముకుందా సినిమా తర్వాత నాగ చైతన్యతో చేసిన ఒక లైలా కోసం సినిమాలో కూడా కట్టు బొట్టు విషయం లో అచ్చమైన తెలుగు అమ్మాయిలా కనిపించింది. అయితే ఈ సినిమాల్లో పూజా.. పద్దతిగా నటిస్తూ ఎక్సపోజింగ్ కి కాస్త దూరమనే సంకేతాలిచ్చింది. ఇక తర్వాత బాలీవుడ్ లో  కాలు పెట్టింది. అక్కడ హృతిక్  తో జోడికట్టి  మోహింజదారోలో నటించింది. ఆ సినిమాలో కూడా యువరాణిగా పూజా మెప్పించింది. ఆ సినిమా ప్లాప్ తో మళ్ళీ అమ్మడు తెలుగులోకి వచ్చిపడింది. మళ్ళీ తెలుగులోకి కాలు పెట్టగానే అల్లు అర్జున్ పక్కన ఛాన్స్ కొట్టేసింది. అల్లు అర్జున్ కి జోడిగా డీజే (దువ్వాడ జగన్నాథం) లో హీరోయిన్ గా నటిస్తుంది. 

ఇక ఈ సినిమాలో పూజా బికినీ వేసుకుందని టాక్. టాక్ ఏమిటి ఇదినిజమనే పిక్ ఒకటి బయటికి వచ్చింది. ఈ ఫోటోలో పాపా చూశారుగా ఏ రేంజ్ లో రెచ్చిపోయిందో. ఈ పిక్ లో పూజ ని చూసిన వాళ్ళెవరైనా నిన్నటిదాకా పద్దతిగా కనబడిన అమ్మాయేనా ఈ బికినిలో వుంది అని అనుకోక మానరు. అసలింతవరకు పూజా హెగ్డే ఇలాంటి బికినీ డ్రెస్ లో, హాట్ లుక్స్ లో ఎప్పుడూ కనిపించలేదు. ఇక ఇప్పుడు ఇలా బికినిలో పూజని చూసిన వాళ్ళందరూ అమ్మో పూజ తక్కువదేం కాదు అంటున్నారు. 

అసలు పూజా ఈ  బికినీ అవతారం డీజే కోసం వేసిందా లేక ఇంకెందుకన్నానా అనేది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్. ఎందుకు వేసిందో ఏమో గాని ఈ బికినీ పిక్ లో పూజా ఇరగదీసేస్తుందన్నది మాత్రం నిజం. 

Show comments


LATEST TELUGU NEWS


LATEST IN NEWS

POPULAR NEWS



LATEST IN GALLERIES

POPULAR GALLERIES