Advertisement
Google Ads BL

నిద్ర పట్టనంత ఆనందంలో థమన్..!


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తమిళ డైరెక్టర్ టీఎన్ నీశన్ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఎ.ఎం. రత్నం ఈ చిత్రానికి నిర్మాత. వీరి కాంబినేషన్ లో రాబోయే పవన్ చిత్రానికి సంగీతం అందించేందుకు తమన్ అవకాశం దక్కించుకున్నాడు.  నీశన్ తో పవన్ చేయబోయే సినిమాకు తానే సంగీత దర్శకుడునంటూ సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత తమన్ ప్రకటించడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. కాగా ఎ.ఎం.రత్నం నిర్మాణం వహించే ఈ చిత్రం దసరాకు కొబ్బరికాయ కొట్టి ప్రారంభోత్సవం కూడా చేసుకుంది.  అయితే ఎంతో కాలం నుండి పవన్ సినిమాకి సంగీత దర్శకత్వాన్ని వహించాలని ఎదురుచూస్తున్న తమన్ కు ఇది అందివచ్చిన అవకాశం కావడంతో చాలా ఎగ్జైట్ అయిపోతూ విషయాన్ని వెల్లడించాడు తమన్. అయితే ఈ విషయాన్ని వెల్లడించడానికి అర్ధరాత్రిని ఎంచుకోవడమే అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది.

Advertisement
CJ Advs

అయితే టాలీవుడ్ లో ‘కిక్’ సినిమాతో ఒక్కసారిగా వెలుగు లోకి వచ్చిన థమన్, వెంటవెంటనే స్టార్ హీరోల సినిమాలకు సంగీతాన్ని అందించి టాలీవుడ్ ను షేక్ చేశాడు. ఒకానొక దశలో ప్రతి ఆడియో ఫంక్షన్ తమన్ ఆడియా ఫంక్షన్ లా అనిపించేది. మహేష్ బాబు నుండి దాదాపు టాలీవుడ్ స్టార్ హీరోలందరితో  థమన్ పనిచేశాడు. ఇక పవన్ సినిమాకి తన సంగీతం రుచులు చూపించాలని ఆరాటపడ్డాడు కానీ ఇంతవరకు ఆ అవకాశం దక్కలేదు.  కాగా ఇప్పుడు అందివచ్చిన అవకాశంగా... పవన్ సినిమాకు తమన్ సంగీతం అందించనున్నాడు.  ఈ విషయం తెలిశాక..తన ఆనందం ను ఎలా సెలెబ్రేట్ చేసుకోవాలో తెలియక, పడుకుంటే నిద్రపట్టక..ఇలా తమన్ అర్ధరాత్రి దాటాక మంచి ముహూర్తం చూసుకొని మరి ఈ విషయాన్ని పోస్ట్ చేశాడు. 

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs