జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన మూడవ భారీ బహిరంగ సభ కోసం అనంతపురం జిల్లాను ఎంపిక చేసుకోవడం తెలిసిందే. అయితే పవన్ అనంత పురాన్నే ఎందకు ఎంచుకున్నట్లు అన్న దానిపైనే ఇప్పుడు అందరి దృష్టి మళ్ళింది. పవన్ మొదట తిరుపతిలో, తర్వాత కాకినాడ, మూడవ సభగా అనంతపురాన్ని ఎంచుకోవడంపై ఇప్పుడు చర్చోపచర్చలు జరుగుతున్నాయి. పవన్ రాజకీయంగా ఈ మధ్య చాలా కీలకమైన అడుగులు వేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా పవన్ ఏలూరులో ఓటును నమోదు చేసుకున్న విషయంపై రాజకీయంగా పెద్ద చర్చలకు దారితీసిన విషయం కూడా తెలిసిందే. అయితే పవన్ ఎవరికీ అంతుపట్టని విధంగా రాజకీయంగా చాలా కీలకంగా మారబోతున్నట్లు దీన్ని బట్టి అర్థమౌతున్న అంశం. ఉన్నట్టుండి అనంతపురంలో భారీ బహిరంగ సభకు ప్లాన్ చేయడంతో ఇక పవన్ రాజకీయంగా బలపడే నిమిత్తం ఎవరిని ఎక్కడ ఎలా చెక్ పెట్టేందుకు ఎలా వ్యవహరించాలో చాలా నేర్పరిగా ముందుకు పోతున్నట్లుగానే ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. కాగా అనంతపురంలోని హిందూపూర్ నియోజక వర్గం నుండి బాలకృష్ణ బలమైన నాయకుడు కాబోతుండటంతో అక్కడ బాలయ్య బాబును చెక్ పెట్టే నిమిత్తం జనసేన పార్టీ పరంగా పవన్ అనంతలో బహిరంగ సభ ఏర్పాటు చేశాడని కూడా టాక్ వినిపిస్తుంది. ఏది ఏమైనా పవన్ ఆచితూచి వేస్తున్న అడుగులపై మాత్రం సర్వత్రా చర్చ కొనసాగుతుంది. ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదాను బలమైన ఆయుధంగా చేసుకొని పవన్ ప్రజల్లో బలమైన నాయకుడుగా ఎదిగేందుకు ప్లాన్ వేస్తున్నట్లు కూడా అర్థమౌతున్న అంశం.