ప్రముఖ ప్రయోగాత్మక చిత్రాలలో నటించిన గొప్ప నటుడు కమల్ హాసన్. ఈయన ఎన్నో ప్రయోగాత్మక చిత్రాలలో నటించి సంచలనం రేపిన విషయం తెలిసిందే. అయితే తాజాగా తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత దాదాపు రెండు నెలల నుండి చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న విషయం తెలిసిందే. దాంతో తమిళనాడు రాష్ట్రం అంతటా గంభీర వాతావరణం నెలకొంది. ఈ సమయంలోనే అంటే ఈరోజు కమల్ హాసన్ పుట్టిన రోజు. కమల్ హాసన్ ఈరోజు 63వ పడిలోకి అడుగుపెడుతున్న శుభ సందర్భంగా ఎలాంటి వేడుకలు, హంగామాలు సృష్టించకుండా నిరాడంబరంగా అలా గడుపుతున్నాడు. కమల్ ఎంతో తెలివిగా ముందుగానే అభిమానులకు కూడా హెచ్చరికలు జారీ చేశాడు.
కమల్ హాసన్ పుట్టినరోజు సందర్భంగా చాలా సాదాసీదాగా గడుపుతున్నాడు. అమ్మ జయలలిత ఆసుపత్రిలో కోలుకుంటున్న సందర్బాన్ని పురస్కరించుకొని ఆడంబరంగా ఎలాంటి వేడుకలు నిర్వహించడానికి వీలులేదంటూ కమల్ అభిమానులను సైతం కోరాడు. అభిమానులు కూడా అంతే జాగ్రత్తగా చెన్నైలో కమల్ హాసన్ పుట్టినరోజు సందర్భంగా ఎలాంటి వేడుకలు జరుపుకోవడం లేదు. అయితే కమల్ గారాల పట్టి అయిన శృతి హాసన్ కమల్ కు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు చెప్పింది. కాగా హాపీ బర్త్ డే మై డార్లింగ్ డాడి అంటూ తండ్రితో ఉన్న ఫోటో ఇన్ స్టర్ గ్రామ్ ద్వారా పోస్ట్ చేసింది శృతి హాసన్. అయితే కమల్- గౌతమి చాలా కాలం పాటు సహజీవనం చేసి ఈ మధ్యనే విడిపోయిన విషయం తెలిసిందే. వీరు విడిపోవడానికి శృతి హాసనే కారణమని కూడా ప్రచారం జరిగింది. ప్రస్తుతం గాయం నుండి కోలుకుంటున్న కమల్ జనవరి నుండి శభాష్ నాయుడు చిత్రం షూటింగ్ లో పాల్గొననున్నాడు.
Advertisement
CJ Advs