Advertisement
Google Ads BL

టీడీపీ పై రోజా జబర్దస్త్ బాణాలు..!


ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకం మనసులు గెలవాలంటే మన నాయకుల ప్రస్తుతం ఉన్న ఒకే ఒక ఆయుధం ప్రత్యేక హోదా. అందుకోసమనే ప్రతి పార్టీ, ఆయా పార్టీలకు చెందిన ప్రతి నాయకుడూ ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అంటూ నినదిస్తున్నాడు. అందుకోసం జగన్ పది మందిని వెంటవేసుకొని తిరుగుతున్నాడు. తాజాగా వైకాపా విశాఖ కేంద్రంగా జై ఆంధ్రప్రదేశ్ అని ఓ భారీ సభను నిర్వహించింది. ఆ సందర్భంగా రోజా జబర్దస్త్ గా మాట్లాడింది. ఓటుకు నోటు కేసు నుండి తప్పించుకునేటందుకే ప్రత్యేక హోదాను సీఎం చంద్రబాబు కేంద్రం ముందు తాకట్టు పెట్టాడని  మండిపడింది. విశాఖపట్టణంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో వైఎస్‌ఆర్‌సీపీ నిర‍్వహించిన జై ఆంధ్రప్రదేశ్ బహిరంగ సభకు భారీగా ఉత్తరాంధ్ర జనం కదిలివచ్చింది.

Advertisement
CJ Advs

ఈ సందర్బంగా రోజా ఓ కెరటంలా చంద్రబాబు పాలనపై విరుచుకుపడింది. దగా పడ్డ తెలుగువాడి పౌరుషాన్ని చాటాలి అంటూ ఓ ఉద్యమంలా కరచినట్లు మాటల తూటాలు పేల్చేసింది. శ్రీశ్రీ, గురజాడ, తెన్నేటి విశ్వనాథం నడయాడిన నేల అంటూ ప్రాంతీయ ఆవేశాన్ని కుమ్మరించి, ఉద్యమాల పురిటిగడ్డ ఉత్తరాంధ్ర హక్కుల కోసం జై ఆంధ్రప్రదేశ్ సభను ఏర్పాటు చేసినట్టు వివరించింది. అధికార మదంతో తెలుగు ప్రజలను మోసం చేస్తున్న చంద్రబాబుకు బుద్ధిచెప్పేందుకే ఈ సభ అంటూ వెల్లడించింది రోజా. 

కాగా ఈ సందర్బంగా రోజా మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్షమే లేదంటూ వ్యాఖ్యానించిన నారా లోకేష్ ని ఓ  కామెడీ ఆర్టిస్ట్ గా అభివర్ణించింది. లోకేష్ కామెడీ ఆర్టిస్ట్ కు ఎక్కువ, కామెడీ విలన్ కు తక్కువ అని ఎద్దేవా చేసింది. ఇంకా ప్రత్యేక హోదా కోసమని వైకాపా ఎంపీలతో రాజీనామా చేయిస్తానని జగన్ ప్రకటించాడని, తెదేపా ఎంపీలతో రాజీనామా చేయిస్తారా అని చంద్రబాబును ప్రశ్నించింది. కనీసం వైకాపా నుండి జంప్ అయిన 20 మంది ఎమ్మెల్యేలతో అయినా రాజీనామా చేయించి ఎన్నికలకు వెళ్లే ధైర్యం మీకు ఉందా  అంటూ నిలదీసింది రోజా. ఇలాంటి వెన్నుపోటు చంద్రబాబుకు ప్రజలే బుద్ధి చెప్పాలని రోజా తనదైన శైలిలో జబర్దస్త్ బాణాలను సంధించింది. 

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs