'కబాలి' చిత్రం చేస్తున్న సమయంలో రజనీ ఆరోగ్యం దెబ్బతిన్నది. ఆ చిత్రం పూర్తి కాగానే ఆయన 'రోబో 2.0' కోసం షూటింగ్‌లో పాల్గొన్నాడు. వాస్తవానికి 'కబాలి' చిత్రం షూటింగ్ సమయంలోనే 'రోబో 2.0' చిత్రానికి వాడుతున్న దుస్తులు, మేకప్ వల్ల రజనీకి స్కిన్ ప్రాబ్లమ్ వచ్చింది. దానికోసమే ఆయన అమెరికా వెళ్లాడు. కానీ అక్కడి వైద్యులు ముందుగా ఆయన కిడ్నీ, లివర్‌లలో సమస్యలు ఉన్నాయని వాటిని ముందుగా తగ్గించి, తర్వాత స్కిన్ ప్రాబ్లమ్‌కు ట్రీట్‌మెంట్ చేస్తామని చెప్పి రజనీని ఒప్పించారు. ఇప్పుడే అదే స్కిన్ ప్రాబ్లమ్ కోసం మరలా అమెరికా వెళ్లి పూర్తిగా చికిత్స చేసుకొని వచ్చాడు. కాగా 'రోబో2.0' చిత్రం షూటింగ్ దాదాపు పూర్తయింది. కొంత ప్యాచ్‌వర్క్, సాంగ్ మినహా మిగిలిన చిత్రం షూటింగ్ పూర్తయింది. ప్యాచ్‌వర్క్‌లో ఎక్కువగా విలన్ అక్షయ్‌కుమార్, హీరోయిన్ అమీజాక్సన్‌ల కాంబినేషన్‌లోని సన్నివేశాలే ఎక్కువగా మిగిలి ఉన్నాయి. రజనీ వస్తే వాటిని చిత్రీకరించవచ్చని దర్శకుడు శంకర్ భావిస్తున్నాడు. ఆ వెంటనే ఉక్రెయిన్‌లో రజనీ- అమీజాక్సన్‌ల మీద ఓ రొమాంటిక్ సాంగ్‌ను చిత్రీకరించాల్సి వుంది. దీంతో ప్యాచ్‌వర్క్‌లో షూటింగ్ పూర్తయిన వెంటనే ఆ సాంగ్‌ను శంకర్ ప్లాన్ చేశారు. సో... నవంబర్ 2వ వారం నుంచి రజనీ మరలా 'రోబో2.0'కు మేకప్ వేసుకోనున్నాడు. కాగా ఈ చిత్రం షూటింగ్ డిసెంబర్ మొదటి వారానికి పూర్తవుతుంది. ఆ తర్వాత విదేశీ నిపుణులతో పోస్ట్‌ప్రొడక్షన్ కార్యక్రమాలకు ఆరునెలల టైమ్ తీసుకోనున్నాడు డైరెక్టర్ శంకర్. కాగా ఈ చిత్రం ఇండియాలో 350 కోట్ల భారీ బడ్జెట్‌తో లైకా ప్రొడక్షన్స్ చిత్రం రూపొందిస్తోంది. ఒక విధంగా చూస్తే ఈ చిత్రం 'బాహుబలి' రెండు పార్ట్‌లకు ఖర్చు చేసినంత మొత్తాన్ని ఒకే ఒక్క 'రోబో 2.0' చిత్రానికే ఖర్చు చేస్తున్నారని కోలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. మరి ఈ వాదనను నమ్మాలా? వద్దా? అన్న విషయం మన ట్రేడ్ వర్గాలు విశ్లేషించాల్సిన అవసరం ఉంది.