పవన్ కళ్యాణ్ - త్రివిక్రమ్ సినిమా పూజా కార్యక్రమాలు జరిపేసుకుంది. ఈ క్రేజీ కాంబినేషన్ అధికారికంగా సినిమాని మొదలెట్టేసినా... పవన్ కాటమరాయుడు సినిమా కంప్లీట్ కాగానే త్రివిక్రమ్ సినిమా షూటింగ్ లో పవన్ పాల్గొంటాడని సమాచారం. ఇక పవన్ - త్రివిక్రమ్ ప్రాజెక్ట్ శనివారం ఉదయం రామానాయుడు స్టూడియోలో పూజా కార్యక్రమాలు జరుపుకుంది. ఇక ఈ సినిమాకి వర్కింగ్ టైటిల్ గా దేవుడే దిగివచ్చిన అని పెట్టారని సమాచారం. అయితే ఈ పూజా కార్యక్రమాలను అట్టహాసం గా చెయ్యకుండా కేవలం కొంతమంది అతిధుల మధ్య కానిచ్చేశారు. ఇక ఈ సినిమాకి సంబంధించి అన్ని కార్యక్రమాలను త్రివిక్రమ్ ఇప్పటికే పూర్తి చేసాడని సమాచారం. ఒక్క నటీనటుల ఎంపిక తప్ప మిగతా విషయాలన్నీ పూర్తయ్యాయని సమాచారం. హారిక అండ్ హాసిని బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్టుకి అనిరుధ్ మ్యూజిక్ డైరెక్టర్ గా చేస్తున్నాడు. ఇప్పటికే త్రివిక్రమ్ డైరెక్షన్ లో పవన్ జల్సా, అత్తారింటికి దారేది వంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించాడు. ఇక ఇప్పుడు ఈ దేవుడే దిగివచ్చిన(వర్కింగ్ టైటిల్) సినిమా పై కూడా భారీ అంచనాలు నెలకొని వున్నాయి. ఇక ఈ చిత్రాన్ని త్రివిక్రమ్ వచ్చే మే లో రిలీజ్ చేస్తానని చెబుతున్నాడు. ఇక త్రివిక్రమ్ డైరెక్షన్ లో పవన్ మళ్ళీ నటించడంతో పవన్ ఫాన్స్ పిచ్చ హ్యాపీగా వున్నారని టాక్. అది కాకుండా..ఇప్పటి వరకు పవన్ కెరీర్ లోనే లేనిది వరుసగా 3 చిత్రాలతో పవన్ బిజీ గా ఉండటం తో..తమ హీరో లైన్ లోకి వచ్చాడని..ఇంక ఆపడం ఎవరితరం కాదని..పవన్ ఫ్యాన్స్ కాలర్స్ ఎగరేస్తున్నారు. పవన్ మాములుగా వున్నప్పుడే..ఫ్యాన్స్ తట్టుకోవడం కష్టం. మరి..ఇలాంటి హ్యాపీ న్యూస్ లు వస్తుంటే..అసలు వారిని ఆపగలరా..!!