జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయంగా చాలా కీలక అడుగులను వేస్తున్నాడు. అందుకు పక్కా ప్లాన్ తో ముందుకు పోతున్నట్లుగానే తెలుస్తుంది. అందుకు తగిన మేధావులను, సమాజం పట్ల అంకితభావంతో మెలిగే వ్యక్తులను లక్ష్యంగా చేసుకొని వారిపై బాణం గురిపెడుతున్నాడు పవన్ కళ్యాణ్. అసలు పవన్ ఏలూరుకి ఓటును మార్చుకోవడమే ఓ సంచలనంగా మారింది. అంటే రాబోవు ఎన్నికలను పవన్ ఆషామాషీగా తీసుకోవడం లేదన్నది దీన్ని బట్టి అర్ధమౌతుంది. అందుకు తగిన స్కెచ్ ను కూడా అంతర్గతంగా రూపొందించుకుంటున్నట్లు జరుగుతున్న పరిణామాలను బట్టి తెలుస్తుంది. తాజాగా పవన్ కళ్యామ్ చకా చకా సినిమాలు కూడా తీసి రాబోవు ఎన్నికల నాటికి సినిమాల జోలికి పోకుండా రాజకీయాలకే ప్రాధాన్యం ఇచ్చే దిశగా అడుగులు వేస్తున్న విషయం చూస్తున్నాం. అంతేకాకుండా ఇంకా ఓ పక్క సినిమాలు చేస్తూనే మరోపక్క పవన్ చాలా జాగ్రత్తగా రాజకీయంగా బలపడటానికి, పార్టీకి మంచి గుర్తింపు తెచ్చే వ్యక్తుల కోసం చూస్తున్నట్లు తెలుస్తుంది. గొప్ప నిజాయితీ గల అధికారులను, నేతలను స్వయంగా వెళ్ళి కలవడం కూడా జరుగుతుంది.
అలా ఈ మధ్య పవన్.. సిబిఐ ఆపీసర్ గా సత్యం కుంభకోణం, 2జి స్పెక్ట్రమ్ స్కామ్, జగన్ అవినీతి వంటి పలు కేసులను అతి వేగంగా డీలు చేసిన లక్ష్మీ నారాయణను పవన్ కళ్యాణ్ రహస్యంగా కలిసినట్లు తెలుస్తుంది. నిజాయితీ పరుడైన సీబీఐ ఆఫీసర్ గా జాతీయ స్థాయిలో ప్రజలను ఆకర్షించిన లక్ష్మీనారాయణ తన వెంట ఉంటే రాజకీయంగా మంచి ప్రయోజనం ఉంటుందని గుర్తించిన పవన్.. లక్ష్మీనారాయణను రహస్యంగా కలిసినట్లుగా వార్తలు వస్తున్నాయి. అయితే పవన్, లక్ష్మీనారాయణను కలిసి జగన్ చెక్ పెట్టేందుకు తగిన సూచనలు, సలహాలను కూడా తీసుకున్నట్లు తెలుస్తుంది.