Advertisement
Google Ads BL

కమల్ తో బ్రేకప్ కి కమలమే కారణమా..!


కమల్ హాసన్ తో విడిపోతున్నట్లు ప్రకటించింది గౌతమీ. ఒకేసారి ఈ వార్త చెప్పి షాక్ కు గురి చేసింది. అయితే కారణం చెప్పకుండా కథని నడిపించింది గౌతమి. అసలు కమల్ తో ఎందుకు విడిపోవాల్సి  వచ్చిందో... ఎక్కడా బయటపెట్టకుండా... విడిపోవడం చాలా బాధకరమని చెప్పుకొచ్చింది. ఇక కమల్ తన జీవితంలో ఇంకా విజయాలు సాధించాలని... ఆయన ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నట్లు ప్రకటించింది. ఇక కమల్ కూడా అది పూర్తిగా గౌతమి వ్యక్తిగత నిర్ణయమని .... తానెలా కావాలంటే అలా చేసుకునే పూర్తి హక్కు గౌతమీకుందని... ఆమె ఎక్కడున్నా తన కూతురితో  హ్యాపీగా వుండాలని కోరుకుంటున్నట్లు చెప్పాడు. అయితే మరో పక్క వీరు విడిపోవడానికి ప్రధాన కారణం శ్రుతీ అని వార్తలొచ్చాయి. వార్తలు రావడమేమిటి... నిన్నటినుండి న్యూస్ ఛానెల్స్, వెబ్ సైట్స్ అన్ని శృతియే వీరు  విడిపోవడానికి కారణమని ఊదరగొట్టేస్తున్నాయి. 

Advertisement
CJ Advs

ఇక శృతి ఆ వార్తలకి స్పందించింది. నా వల్ల కమల్, గౌతమీ విడిపోలేదని... వారి వ్యక్తిగత కారణాల వల్లే వారు విడిపోయారని దీనిలో తన ప్రేమయం లేదని మీడియాకి కుండబద్దలు కొట్టింది. ఇక తనకి తన కుటుంబ సభ్యులు, తన చెల్లె ముఖ్యమని చెప్పేసింది. మరి యే కారణం వళ్ళ విడిపోయారా అని మళ్ళీ మీడియా తలపట్టుకుంది. అయితే శృతి కారణం కాదని దీనికి వేరే కారణం ఉందని మరో న్యూస్ ని ప్రచారం చెయ్యడం మొదలు పెట్టింది మీడియా.

ఇక ఆ కారణం ఏమిటంటే గౌతమి త్వరలోనే రాజకీయాల్లోకి వెళ్లబోతుందని.... అందుకే ఆమె కమలనాథులతో సంప్రదింపులు జరిపిందని అంటున్నారు. ఇక ఈ రాజకీయాలకు కమల్  హాసన్ చాలా దూరం గనక గౌతమి, కమల్ నుండి విడిపోయి రాజకీయాల్లో బిజీ అవ్వాలని అనుకుంటుంది అంటున్నారు. ఇక ఇప్పటికే గౌతమి ఆ వైపు అడుగులు వేస్తూ కమల్ తో తెగ తెంపులు చేసుకుందని... కేవలం కమల్ కి ఇబ్బంది కలిగించకూడదనే గౌతమి ఈ నిర్ణయం తీసుకుందని చెబుతున్నారు. ఇక త్వరలోనే ఆమె రాజకీయాల్లో బిజిగా మారి 2019 ఎన్నికల్లో పోటీ చెయ్యడానికి సిద్ధమవుతుందని అంటున్నారు. ఇక కమల్ రాజకీయ నాయకులతో యే విధంగా మసులుతాడో అందరికి తెలుసు. వీరిని విమర్శించడంలో అస్సలు వెనుకాడడు. ఇక గౌతమి రాజకీయాల్లో కొనసాగితే ఇద్దరికి పడక పోవచ్చని గౌతమి ఈ నిర్ణయం తీసుకుందని ఇప్పుడు కోలీవుడ్ మీడియా కోడై కూయడం మొదలెట్టింది. 

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs