బెంగాల్ టైగర్ తర్వాత రవితేజ ఇప్పటి వరకు ఏ సినిమాని అంగీకరించలేదు. కొన్ని సినిమాలు ఒప్పుకున్నా అవి ఆదిలోనే ఆగిపోయాయి. అయితే ఇందుకు ప్రధాన కారణమేమిటనేది ఇప్పటి వరకు ఎవరికి తెలియదు. పారితోషికం విషయంలో రాజీపడటం ఇష్టం లేక అని ఓ వర్గం మీడియా, కథలు నచ్చక సినిమాలు చేయడం లేదని మరో సెక్షన్ మీడియా ప్రచారం చేసింది. అయితే రవితేజ సినిమా చేయకపోవడానికి అసలు కారణం..అతనిలో వేదాంత ధోరణి పెరిగిందని... జీవితాన్ని ఇక నుంచైనా అనుభవించాలనే నిర్ణయం తీసుకున్నానని... ప్రపంచం మొత్తం చుట్టేసే మూడ్‌లో వున్నానని.. ఇప్పుడు సినిమాలు చేసే మూడ్ లేదని.. రవితేజ స్వయంగా దర్శకుడు పూరి జగన్నాథ్‌తో చెప్పాడట. అంతేకాదు పూరి జగన్నాథ్‌ను కూడా దర్శకత్వం మానేసి తన రూట్‌లో వచ్చేయమని రవితేజ చెప్పడంతో పూరి షాకయ్యాడట. ఈ విషయాన్ని ఇటీవల పూరి జగన్నాథ్ మీడియా ఇంటర్వ్యూలో తెలియజేశాడు. సో.. రవితేజ సినిమాలకు గుడ్‌బై చెప్పాడని ఫిల్మ్‌నగర్‌లో పుకార్లు వినిపిస్తున్నాయి.