తాజాగా తన దర్శకత్వంలో కళ్యాణ్‌రామ్ హీరోగా విడుదలైన 'ఇజం' చిత్రం విమర్శకులను మెప్పిస్తూ, హీరోగా, నిర్మాతగా నందమూరి కళ్యాణ్‌రామ్ స్దాయిని ఓ మెట్టు పైకెక్కించింది. ఈ చిత్రం విజయవంతంగా రన్ అవుతున్న సందర్భంగా సినిమా సినిమాకి పెద్దగా గ్యాప్ ఇవ్వని దర్శకుడు పూరీ జగన్నాథ్ తన తదుపరి చిత్రం స్క్రిప్ట్ కోసం తనకు ఆస్దాన ప్రదేశమైన 'బ్యాంకాక్'కు వెళ్లాడు. కాగా పూరీ జగన్నాథ్ స్క్రిప్ట్ ఎవరికోసం? యంగ్‌టైగర్ కోసమా? లేక మహేష్‌బాబు కోసమా? అనే అంశం ఇప్పుడు టాలీవుడ్‌లో చర్చనీయాంశం అయింది. కాగా ఇటీవల పూరీ తన హీరో మహేష్‌బాబు కోసం ఆయన బర్త్‌డే కానుకగా 'జనగణమన' అనే టైటిల్‌ను రెడీ చేసి పోస్టర్‌ను, ఫస్ట్‌లుక్‌ని కూడా రెడీ చేశాడు. మరో పక్క ఆయన నందమూరి కళ్యాణ్‌రామ్‌తో 'ఇజం' చిత్రం చేస్తున్నప్పుడు తన తదుపరి చిత్రాన్ని కళ్యాణ్‌రామ్ తమ్ముడైన ఎన్టీఆర్‌తో చేస్తానని మాట ఇచ్చాడట. ఈ స్టోరీ మరేదో కాదని, చిరంజీవి 150 చిత్రం కోసం తను తయారుచేసిన 'ఆటోజానీ' చిత్రం కథేనని తెలుస్తోంది. పూరీ తయారు చేసిన ఈ చిత్రం మెగాస్టార్ చిరంజీవిని కూడా మెప్పించింది. కానీ చిరుకు ఆయన తయారు చేసిన సెకండాఫ్ నచ్చలేదు. లేకపోతే ఈ పాటికి వినాయక్ స్దానంలో పూరీ ఉండేవాడు అనేది అందరకీ తెలిసిందే. కాగా చిరు కోసం మరో పవర్‌ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేయగల సత్తా తనకు ఉందని భావించి, 'ఆటోజానీ' చిత్రం కథను ఎన్టీఆర్‌కు అనుగుణంగా మార్పులు చేర్పులు చేసి ఇటీవలే ఎన్టీఆర్‌కు చెప్పాడని, సెకండాఫ్ కూడా పూరీ స్టైల్‌లోనే ఉండటంతో ఈ చిత్రం సెకండాఫ్ కూడా యంగటైగర్‌కు బాగా నచ్చడంతో పూరీ చిత్రానికి ఓకే చెప్పాడనే వార్తలు వస్తున్నాయి. సో.. మరి పూరీ బ్యాంకాక్‌లో తయారు చేస్తున్న స్క్రిప్ట్ మహేష్ కోసమా? లేకపోతే ఎన్టీఆర్ కోసమా అనే చర్చ మొదలైంది. ప్రస్తుతం మహేష్.. మురగదాస్, కొరటాల శివ, వంశీ పైడిపల్లి చిత్రాల తర్వాత మాత్రమే ఫ్రీ అవుతాడు. ఆ గ్యాప్‌లో పూరి..యంగ్‌టైగర్‌తో 'టెంపర్'ని మించే హిట్ ఇవ్వడం కోసమే స్టోరీ తయారు చేస్తున్నాడని వినిపిస్తుంది.