మహేష్ ఈ మధ్యన విరామం లేకుండా సినిమా షూటింగ్ చేసేస్తున్నాడు. మహేష్ తమిళ డైరెక్టర్ మురుగదాస్ డైరెక్టన్ లో ఒక చిత్రంలో నటిస్తున్నాడు. మురుగదాస్ చిత్రం కంప్లీట్ కాగానే మహేష్ మరో సినిమాని అప్పుడే లైన్లో పెట్టేసాడు. అది శ్రీమంతుడితో ఇండస్ట్రీ కి టాప్ 2 హిట్ ఇచ్చిన కొరటాల శివ తో ఉంటుందని ఎప్పుడో ప్రకటన వచ్చేసింది. వీరిద్దరి హిట్ కాంబినేషన్ మరోసారి తెరకెక్కబోతుంది. ఇక ఈ కాంబినేషన్ లో వచ్చే సినిమాపై భారీ అంచనాలే ఏర్పడ్డాయి. ఇక మహేష్... మురగదాస్ సినిమా కంప్లీట్ అవ్వగానే కొరటాల సినిమాలోకి దూకేస్తాడన్నమాట. ఈ సినిమాలో మహేష్ పొలిటిషన్ గా కనిపించనున్నాడని సమాచారం. ఇక కొరటాల అప్పుడే ఆ చిత్రానికి సంబంధించి అన్ని కార్యక్రమాలు మొదలెట్టేశాడని, మహేష్ కి జోడి గా నటించే హీరోయిన్స్ వేటలో కొరటాల ఉన్నాడనే టాక్ కూడా బయటికొచ్చింది.
ఇక ఇప్పుడు మహేష్ - కొరటాల చిత్రానికి సంబంధించి మరో ఆసక్తికర విషయం బయటికి వచ్చింది. అదేమిటంటే వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చే చిత్రానికి టైటిల్ కన్ఫర్మ్ అయ్యిందట. 'భరత్ అను నేను' అనే టైటిల్ ని మహేష్ కోసం కొరటాల ఫిక్స్ చేసాడని సమాచారం. ఇక ఈ టైటిల్ చూస్తుంటే మహేష్ ఏదో ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు మొదలు పెట్టె మొదటి వాక్యం గా అనిపిస్తుంది. ఎందుకంటే ఈ సినిమాలో ఎలాగూ మహేష్ ఒక పొలిటిషన్ గా నటిస్తున్నాడు. ఇక పొలిటిషన్ అంటే ఏదైనా కావచ్చు. ఒకటి మంత్రైనా అయ్యుండాలి లేదా ముఖ్యమంత్రి కేరెక్టర్ అయినా అయ్యుండాలి. అందుకే ప్రమాణ స్వీకారం రోజున మహేష్ ఇలా భరత్ అను నేను అంటూ మొదలెడతాడన్నమాట. అందుకే ఎంతో అలోచించి కొరటాల మహేష్ కి ఈ టైటిల్ సెట్ చేసాడనే ప్రచారం జోరందుకుంది.
మరి మహేష్ ని ఈసారి మనం ముఖ్యమంత్రిగా లేదా ఒక మంత్రిగా చూడొచ్చన్నమాట. ఇప్పటికే మహేష్ దూకుడు సినిమాలో ఎమ్యెల్యేగా కనిపించి అలరించాడు. అయితే షూటింగ్ లో వున్న మహేష్ - మురుగదాస్ చిత్రానికి ఇంకా టైటిల్ పెట్టలేదుగాని... ఇంకా పట్టాలెక్కని సినిమాకి మాత్రం అప్పుడే టైటిల్ కన్ఫర్మ్ అయిపొయిందంట. వెరైటీగా లేదూ!