హాస్యనటుడు సప్తగిరి హీరోగా నటిస్తున్న 'సప్తగిరి ఎక్స్‌ప్రెస్' ఆడియో విడుదలకు పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ అతిథిగా హాజరవుతున్నారనే వార్త చర్చనీయాంశమైంది. పవన్ అతిథిగా రావాలంటే అనేక సమీకరణాలుంటాయి. అబ్బాయి (రామ్‌చరణ్) 'ధృవ' సినిమాకు హాజరవుతాడా? లేదా? అనే చర్చ ముగియలేదు. అలాగే మెగా కుటుంబ హీరోలు నటించిన సాయిధరమ్, వరుణ్‌తేజ్ సినిమాలకు సైతం రావడానికి ఇష్టపడని పవర్‌స్టార్ ఒక బుల్లి హీరో సినిమాకు ఎందుకు వెళుతున్నట్టు? పవన్ సినిమాలో సప్తగిరి కలిసి నటించింది లేదు. వారిద్దరి మధ్య పరిచయం కూడా లేదు. అయినప్పటికీ ఆడియోకు రావడానికి పవన్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ఆశ్చర్యం కలిగించింది. అయితే దీని వెనుక కొంత కసరత్తు జరిగినట్టు సమాచారం. 'సప్తగిరి ఎక్స్‌ప్రెస్' దర్శకుడు అరుణ్ పావర్.. త్రివిక్రమ్ వద్ద దర్శకత్వ శాఖలో చేశాడు. 'అత్తారింటికి దారేది' సమయంలో పవన్‌తో కలిసి పనిచేశాడు. ఆ పరిచయంతో, త్రివిక్రమ్ సిఫారసుతోనే పవన్‌కల్యాణ్‌ను ఒప్పించాడని సమాచారం. అలాగే పవన్ కొత్త సినిమా 'కాటమరాయుడు'. ఈ టైటిల్ సప్తగిరి రిజిస్టర్ చేయించాడని, పవన్ సినిమా కోసం వదులుకున్నాడని, ఆ అభిమానంతోనే అతిథిగా వస్తున్నాడని అంటున్నారు. ఏది ఏమైనా 'సప్తగిరి ఎక్స్‌ప్రెస్' సినిమాకు హైప్ క్రియేట్ కావడానికి పవన్ రాకకారణం అవుతోంది.