సింహా సినిమా సమయంలో తనకు ఘోరమైన అన్యాయం జరిగిందంటూ రచ్చరేపుతున్నాడు దర్శకుడు కొరటాల. దాంతో పరిశ్రమంతా సినీపరిశ్రమలో ఇలా కూడా జరుగుతూ ఉంటాయా అంటూ విచిత్రంగా చూశారు సినీజనం. కాగా సింహా సినిమాకి కొరటాల పనిచేసిన విషయం తెలిసిందే. కానీ టైటిల్ కార్డులో కొరటాల శివ పేరు మాత్రం ఉండదు. ఈ సినిమా సమయంలో బోయపాటి శ్రీనుకు, కొరటాల శివకూ మధ్య చాలా విషయాలు నడిచాయి. అవేంటంటే.. సింహా చిత్రానికి కథను చెక్కడంలోనూ, కథా చర్చల్లోనూ కూర్చున్న రచయితల్లో కొరటాల శివ ఉన్నాడు. ముఖ్యంగా ఈ సినిమాకి దాదాపు రెండు నెలలు పనిచేశాడు కొరటాల. ఆ సందర్భంగా సింహా సినిమా విషయంలో కొరటాల చాలా తక్కువ శాతం ఉపయోగపడ్డాడని, ఆయన కథకు సంబంధించి ఇచ్చిన ఎలిమెంట్స్ చాలా తక్కువని అందుకనే టైటిల్ కార్డ్స్‌లో ఎలా వేస్తారన్న విషయం నుండి చర్చ మొదలైందంట. అసలు ఈ సినిమాకు కథా చర్చల్లో చాలా మంది రచయితలు పాల్గొనడంతో ఎవరి పేరు వేయాలన్న విషయంలో వాదోపవాదాలు జరిగి అలా కొరటాల పేరు కూడా వేయలేదన్నది టాక్. అలా రచయితలకు రచయితలకు మధ్య చిన్నపాటి ఘర్షణ కూడా జరిగిందని అప్పట్లో ప్రచారం సాగింది.
తన పేరు కచ్ఛితంగా వేయాలంటూ కొరటాల పట్టుబట్టడంతో, కథకు బేసిక్ ఐడియా అందించిన బోయపాటికి ఎవరి పేరు వేయడం ఇష్టంలేక నో అని చెప్పేశాడంట. దాంతో కొరటాల శివకి కష్టంగా అనిపించి బయటకు వచ్చేసినట్టు తెలుస్తున్న అంశం. అంతే కాకుండా సింహా సినిమాకి తాను పనిచేసినందుకు గానూ రూ.7 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశాడట కొరటాల. అందుకు బోయపాటి రెండు నెలలకి రూ.6 లక్షల వరకూ ఇచ్చేసినట్లు తెలుస్తుంది. మొత్తానికి అలా సింహా సినిమాకు గాను కథా చర్చల విషయంలో కొరటాలకు రావాల్సిన పారితోషికం అందినట్టుగానే సినీవర్గాలు అంటున్నాయి. కానీ వారిద్దరి మధ్య ఏర్పడిన అంతరం మాత్రం వీడలేదు. అది ఇంకా కొనసాగుతూనే ఉంది. మొత్తానికి బృందావనం సినిమాతో ఎన్టీఆర్ దృష్టిలో పడ్డ కొరటాల..దర్శకుడిగా ప్రయత్నాలు మొదలెట్టి ప్రభాస్ తో 'మిర్చి' హిట్టు కొట్టి తానేంటో చూపించాడు. ఇక అంతే కొరటాల కెరటం అలా సాగిపోతూనే ఉంది. అదన్నమాట కొరటాలకు బోయపాటికి మధ్య వచ్చిన డిఫరెన్సెస్.