ఇటీవలి కాలంలో టాలీవుడ్, కోలీవుడ్‌లలో నయనతార తర్వాత ఎక్కువ లాంగ్ రన్ సాధించిన వారు ఎవరు అని పరిశీలిస్తే అందులో హీరోయిన్ త్రిషను ముందుగా చెప్పుకోవాలి. సిద్దార్ద్ వంటి యంగ్ హీరోలతోనే కాదు.. ఎన్టీఆర్, మహేష్‌బాబు, ప్రభాస్‌లే కాదు.. చిరంజీవి, వెంకటేష్, బాలకృష్ణ, నాగార్జున వంటి సీనియర్స్‌తో కూడా ఆమె జతకట్టింది. కాగా ఇటీవలి కాలంలో త్రిష జోరు తగ్గింది. ఆమె ఇక తన కెరీర్‌కు ఫుల్‌స్టాప్ పడుతుందని అందరూ భావిస్తున్న సమయంలో 'కళావతి' ద్వారా ఈ వయసులో కూడా బికీనీ వేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. తాజాగా ఆమె ఇటీవల దీపావళి కానుకగా విడుదలైన తమిళ స్టార్ ధనుష్ ద్విపాత్రాభినయం చేసిన 'కోడి' (తెలుగులో 'ధర్మయోగి') చిత్రంలో నటించింది. ఈ చిత్రం చూసిన వారంతా ధనుష్‌కు పోటీగా నటించిన త్రిషను మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు. ఈ చిత్రంలో ఆమె లేడీ విలన్ పాత్రను అద్భుతంగా చేయడం ద్వారా ఇక నుంచి తన ద్వారా లేడీ విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌ల వంటి పాత్రలను కూడా ఆశించవచ్చని ఇన్‌డైరెక్ట్‌గా అందరికీ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. 'కోడి' ఉరఫ్ 'ధర్మయోగి' చిత్రంతో ఆమె ప్రస్తుతం తమిళ, తెలుగు ఇండస్ట్రీలలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ చిత్రం త్రిషకు సెకండ్ ఇన్నింగ్స్‌గా చెప్పవచ్చని, మరికొంత కాలం ఆమె కోలీవుడ్, టాలీవుడ్‌లలో తన హవా చూపడం ఖచ్చితమని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.