మహేష్ బాబు ఇప్పుడు మురుగదాస్ డైరెక్షన్ లో ఒక చిత్రాన్ని తెలుగులో, తమిళం లో ఏకకాలంలో చేస్తూ బిజీగా వున్నాడు. ఇక ఈ సినిమాకి ఇంకా టైటిల్ అంటూ ఏమి అనుకోలేదు. అయితే మహేష్ బాబు, మురుగదాస్ సినిమా ఫస్ట్ లుక్ మొన్న వచ్చిన దసరా పండక్కి రిలీజ్ చేస్తారని.... అలాగే వారి సినిమాకి సంబంధించి టైటిల్ ని కూడా అనౌన్స్ చేస్తారని మహేష్ ఫ్యాన్స్ ఎంతో ఎదురు చూసారు. కానీ ఆ సినిమాకి సంబంధించి ఎటువంటి న్యూస్ కూడా ఆ పండక్కి బయటికి రాలేదు. ఈ సినిమాలో మహేష్ ఇన్వెస్టిగేషన్ ఆఫిసర్ గా చేస్తున్నాడు. ఈ సినిమాలో మహేష్ కి జోడిగా రకుల్ ప్రీత్ సింగ్ మొదటిసారిగా నటించనుంది. దసరాని కాదనుకుని ఈ సినిమా ఫస్ట్ లుక్ తమిళులకు అత్యంత ప్రీతికరమైన పండగ దీపావళికి విడుదల చేస్తారనే ప్రచారం జరిగింది. ఇక తెలుగులో కూడా దీపావళి అతి పెద్ద పండగ అందుకే మురుగదాస్ ఈ విధంగా ప్లాన్ చేసాడనే ప్రచారం జరిగింది. ఇక ఈ ఫస్ట్ లుక్ టీజర్ కి సంబంధించి స్పెషల్ గా కొన్ని సీన్స్ షూట్ చేశారనే వార్తలూ హల్ చల్ చేశాయి. ఇక మహేష్ ఫ్యాన్స్ తమ హీరో లుక్ ఎప్పుడెప్పుడు బయటికొస్తుందా అని కళ్ళల్లో ఒత్తులేసుకుని కాచుక్కూర్చున్నారు. దీపావళి వచ్చింది వెళ్ళింది కానీ మహేష్ సినిమా ఫస్ట్ లుక్ గాని, టైటిల్ గాని బయటికి రాలేదు. అసలు మహేష్ సినిమాకి సంబంధించి ఏ న్యూస్ కూడా బయటికి రాలేదు. మరి ఈ దీపావళికి షూటింగ్ లో ఉన్న ప్రతి ఒక్క హీరో ఫస్ట్ లుక్స్ బయటికి వచ్చి తెగ హడావిడి చేశాయి. చిన్న, పెద్దా హీరో అంటూ తేడా లేకుండా తమ తమ సినిమాల ఫస్ట్ లుక్స్ తో ఫ్యాన్స్ ని, ప్రేక్షకులని అలరించారు. ఒక్క మహేష్ సినిమాకి సంబంధించి తప్ప మిగిలిన వారంతా ఈ పండగని తమ్ లుక్స్ తో సెలబ్రేట్ చేసుకున్నారు. మరి మహేష్ తన సినిమా ఫస్ట్ లుక్ ని, ఫస్ట్ టీజర్ ని ఎప్పుడు విడుదల చేస్తాడో గాని మహేష్ ఫ్యాన్స్ మాత్రం తమ అభిమాన హీరో లుక్ కోసం మాత్రం తెగ వెయిట్ చేస్తున్నారు.