పవన్ కళ్యాణ్ అన్ని రూమర్స్ కి చెక్ పెట్టేసాడు. కాటమరాయుడు సినిమా ఫస్ట్ లుక్ తో ఈ దీపావళి పండగకి ఫ్యాన్స్ ని పండగ చేసుకోమని పవన్, శృతి హాసన్ తో కలిసి వచ్చేసాడు. ఇప్పటి వరకు కాటమరాయుడు సినిమా పై అనేక రూమర్స్ షికార్లు చేశాయి. ఈ చిత్రం పై పవన్ అసంతృప్తిగా వున్నాడని, డైరెక్టర్ డాలి పై కోపం గా వున్నాడని అబ్బో ఒకటేమిటి చాలా రూమర్స్ ప్రచారం లోకి వచ్చాయి. అసలు పవన్ కాటమరాయుడు సెట్స్ నుండి వెళ్లిపోయాడనే ప్రచారము జరిగింది. ఇంకా ఈ సినిమాలో పవన్ కి జోడిగా చేస్తున్న శృతి హాసన్ కూడా డేట్స్ ప్రాబ్లెమ్ లో పడిందని.... ఈ సినిమా చాలా లేట్ అయ్యే పరిస్థితులు ఉన్నాయని ప్రచారం జరిగాయి. కానీ పవన్ మాత్రం రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలని... అందుకే ఈ సినిమాని తొందరగా కంప్లీట్ చెయ్యడానికి తొందరపడుతున్నాడు. అందుకే ఫ్యాన్స్ కి దీపావళి పండగతో పాటు తన సినిమా ఫస్ట్ లుక్ తో సెలెబ్రేషన్స్ చేసుకోమని డీసెంట్ లుక్ తో వచ్చి అలరించాడు. ఇక ఈ ఫస్ట్ లుక్ లో పవన్, శృతి హాసన్ కలిసి దీపాలు పెడుతూ దీపావళిని సెలెబ్రేట్ చేసుకుంటున్నట్లు చూపించారు. ఈ లుక్ తో ఈ సినిమా ఫ్యామిలీ ఎంటర్టైనర్ అనిపించే రీతిలో ఉంటుందని అందరూ ఒక అంచనాకి వచ్చేసారు. ఏంతో అందంగా ఈ పోస్టర్ లో పవన్, శృతి హాసన్ కనిపిస్తున్నారు. దీపావళి కి అసలైన లుక్, అసలైన సంబరం అనేలా లుక్ ఉండటంతో పవన్ ఫ్యాన్స్.. దీవాళి ముందే వచ్చేసింది అన్నంత ఆనందంలో వున్నారు.