Advertisement
Google Ads BL

చరణ్ కోసం బాలయ్య దర్శకుడు..!


దర్శకునిగా ఒక్కో మెట్టు ఎదుగుతున్న దర్శకుడు క్రిష్‌ ప్రస్తుతం బాలయ్య హీరోగా 'గౌతమీపుత్ర శాతకర్ణి' అనే చారిత్రక చిత్రాన్ని వందో చిత్రంగా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం సినిమా విడుదలకు ముందు తెలుగు రాష్ట్రాల్లో ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ను పూర్తి చేసుకుంది. ఈ చిత్రం సీడెడ్‌, వైజాగ్‌ హక్కులను వారాహిచలన చిత్రం బేనర్‌, ఈస్ట్‌లో సురేష్‌బాబుతో కలిసి ఈ చిత్రాన్ని సాయి కొర్రపాటి విడుదల చేయనున్నారు. ఇక నెల్లూరులో భరత్‌, వెస్ట్‌లో ఎల్‌.వి.ఆర్‌.కృష్ణలు రిలీజ్‌ చేయనున్నారు. మరోపక్క తన ఏ చిత్రానికి చేయని విధంగా బాలయ్య 100వ చిత్రానికి క్రిష్‌ భారీ ప్రమోషన్‌ కార్యక్రమాలను చేయడానికి రెడీగా ఉన్నాడు. కాగా ప్రస్తుతం క్రిష్‌ తదుపరి చిత్రంపై ఇప్పటి నుంచే అంచనాలు మొదలయ్యాయి. అతి తక్కువ బడ్జెట్‌తోనే 'బాహుబలి' రేంజ్‌లో ఈ చిత్రం ఉంటుందని క్రిష్‌ ఆల్‌రెడీ చెప్పాడు. మరి ఈ చిత్రం విడుదలైన తర్వాత తన చిత్రంతో విజువల్‌గా వండర్‌ చేస్తే మాత్రం తన కుమారుడు చరణ్‌ తదుపరి చిత్రాన్ని క్రిష్‌ చేతిలో పెట్టడం మెగాస్టార్‌ ఆశయంగా తెలుస్తోంది. అశ్వనీదత్‌ నిర్మాతగా మెగాస్టార్‌ చిరంజీవి, శ్రీదేవి నటించిన చిత్రం 'జగదేకవీరుడు- అతిలోకసుందరి' వంటి బ్లాక్‌బస్టర్‌ను తీసిన రాఘవేంద్రరావు ఈ చిత్రాన్ని రాజమౌళి చేతుల్లో పెట్టాలని భావించిన్నప్పటికీ అది వీలు కాకపోవడంతో 'జగదేకవీరుడు' చిత్రాన్ని క్రిష్‌ చేతిలో పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

Advertisement
CJ Advs
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs