Advertisement
Google Ads BL

ఎన్టీఆర్ లిస్ట్ లోకి మరో ఇద్దరు..!!


జనతా గ్యారేజ్ సినిమా విడుదలై అప్పుడే రెండు నెలలు దాటింది. ఇక ఈ సినిమాని టీవీలో కూడా ప్రదర్శించేసారు. కానీ ఇప్పటివరకు జనతా హీరో ఎన్టీఆర్ మరో ప్రాజెక్ట్ కి సైన్ చెయ్యలేదు. అసలు ఏ డైరెక్టర్ తో చేస్తే తన సినిమా హిట్ అవుతుందో అని ఎన్టీఆర్ తెగ ఆలోచిస్తున్నట్టు ఉంది ఎన్టీఆర్ వాలకం. ఆచితూచి అడుగు వెయ్యాలని బాగా నిర్ణయించుకుని ఇంత గ్యాప్ తీసుకుంటున్నాడని అంటున్నారు ఎన్టీఆర్ సన్నిహితులు. ఇప్పటిదాకా  చకచకా సినిమాలను చేసిన ఎన్టీఆర్ చాలా రోజుల తర్వాత ఇలా దీర్ఘ ఆలోచనలో పడ్డాడు. ఏ డైరెక్టర్ అయితే తనకు మంచి హిట్ ఇవ్వగలడు అని ఎన్టీఆర్ ఆలోచనలో ఉండగా.. ఒకపక్క మీడియా మాత్రం ఎన్టీఆర్.. పూరి తో సినిమా చెయ్యాలని డిసైడ్ అయ్యాడని ఒకసారి, మరోసారి ప్రేమమ్ డైరెక్టర్ తో సినిమా కమిట్ అవుతున్నాడని అంటూ ఊదరగొట్టేస్తున్నాయి. అయితే ఎన్టీఆర్ కి మాత్రం త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఒక సినిమా చెయ్యాలని ఉందట. కానీ త్రివిక్రమ్ మాత్రం పవన్ జపం చేస్తూ పవన్ తో చేసే సినిమా కోసమే వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నాడు. ఇంకేముంది ఎన్టీఆర్ తో సినిమా చెయ్యడానికి త్రివిక్రమ్ రెడీగా లేడు. ఇక ఎన్టీఆర్ మరోదారి చూసుకుంటున్నాడని అంటున్నారు.

Advertisement
CJ Advs

అయితే  ఎన్టీఆర్ మాస్ సినిమా చెయ్యాలని చూస్తున్నాడని అంటున్నారు. అందుకే మాస్ చిత్రాలకు పేరుపొందిన వి.వి. వినాయక్, సురేంద్ర రెడ్డి మీద ఎన్టీఆర్ చూపు పడిందని అంటున్నారు. ఇక వీరిద్దరిలో ఎవరితోనైనా సినిమా చెయ్యాలని ఎన్టీఆర్ అనుకుంటున్నాడనే వార్త ఇప్పుడు ఫిలిం నగర్ సర్కిల్స్ లో హల్ చల్ చేస్తుంది. మరి వి. వి వినాయక్.. చిరు 150 చిత్రం ఖైదీ నెంబర్ 150 తో బిజీగా వున్నాడు. ఆ సినిమా పూర్తవ్వడానికి ఇంకా రెండు నెలలు సమయం పడుతుంది. ఇక ఇంకో దర్శకుడు సురేందర్ రెడ్డి కూడా రామ చరణ్ తో ధృవ సినిమా చేస్తున్నాడు. ఈ ధృవ చిత్రం కూడా పూర్తవడానికి దాదాపు ఇంకో నెల సమయం పడుతుంది. మరి వీరు తమ సినిమాలు కంప్లీట్ చేసుకుని ఫ్రీ అయ్యేవరకు ఎన్టీఆర్ ఎదురు చూస్తాడా...! లేక ఈ మధ్యలో ఇంకో డైరెక్టర్ కి కమిట్ అవుతాడో చూద్దాం.

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs