Advertisement
Google Ads BL

సింహం, సూర్య రెండూ ఒకటే అనేలా వుంది!


'సింగం' సీరీస్ తో సూర్య అదిరిపోయే నటనని ప్రేక్షకులకి పరిచయం చేసుకుంటూ పోతున్నాడు. 'సింగం 1' లో అనుష్క తో రోమాన్స్ చేసి విలన్ ప్రకాష్ రాజ్ కి చుక్కలు చూపించిన సూర్య నటన... 'సింగం 2' లో పీక్ స్టేజ్ కి వెళ్లిందని చెప్పాలి. సూర్య డిఫరెంట్ మూవీస్ తో ప్రేక్షకుల ముందుకు రావడానికే ఎక్కువగా ఇష్టపడుతుంటారు. అయన కెరీర్ లో చాలా వెరైటీ కేరెక్టర్స్ లో కనిపించిన సూర్య 'సింగం 1,2' లో మాత్రం పోలీస్ గానే చేస్తూ వస్తున్నాడు. ఇక ఆ రెండు వెర్షన్స్ కూడా సూర్యని టాప్ రేంజ్ కి తీసుకెళ్లాయి. ఇప్పుడు మళ్ళీ సూర్య 'సింగం' సీక్వెల్  'ఎస్ 3' (సింగం 3 ) హరి డైరెక్షన్ లో చేస్తున్నాడు. ఇప్పటి వరకు డైరెక్టర్ హరి సూర్యని పవర్ ఫుల్ ఎనర్జిటిక్ పోలీస్ గా చూపించాడు. ఇక ఇప్పుడు 'ఎస్ 3' లో కూడా సూర్యని ఒక రేంజ్ లో చూపించడానికి రెడీ అయ్యాడు. ఈ 'ఎస్ 3' కి సంబందించిన మోషన్ పోస్టర్ ని, ఫస్ట్ లుక్ ఫొటోస్ ని దీవాళి ని పురస్కరించుకుని విడుదల చేశారు. ఈ లుక్ లో సూర్య మునుపటి 'సింగం' సీక్వెల్స్ కి తీసిపోకుండా ఇంకా పవర్ ఉన్న పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడని అర్ధమవుతుంది. సింహానికి పోలీస్ డ్రెస్ వేస్తె ఎలా ఉంటుందో చూపించాడు డైరెక్టర్ హరి. సింహం గర్జిస్తూ ఉంటే అందులో సూర్యని చూపించాడు. అంటే సింహం, సూర్య రెండు ఒకటే అనే రీతిలో ఈ మోషన్ పోస్టర్ ని తయారు చేయించారన్నమాట. ఇక ఈ సినిమాని ఈ దీపావళికే విడుదల చేద్దామని అనుకున్నప్పటికీ... సూర్య తమ్ముడి  'కాష్మోరా' సినిమా విడుదల ఉండడంతో సూర్య 'ఎస్ 3'  సినిమాని డిసెంబర్ లో విడుదల చెయ్యాలని నిర్ణయించున్నాడు. ఇక ఈ దీపావళికి కేవలం ఫస్ట్ లుక్ తో ఫాన్స్ ని పండగ చేసుకోమని సూర్య 'ఎస్ 3' మోషన్ పోస్టర్ ని విడుదల చేశారు.

Advertisement
CJ Advs

Click Here to see the S3 Motion Poster

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs