Advertisement
Google Ads BL

పవన్, త్రివిక్రమ్ సినిమా రూమర్స్ కి చెక్!


పవన్‌కళ్యాణ్‌, త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ల కాంబినేషన్‌లో 'జల్సా, అత్తారింటికి దారేది చిత్రం తర్వాత హ్యాట్రిక్‌ సినిమా రానుంది. కాగా ఈ కాంబినేషన్‌లో చిత్రం ఉంటుందని తెలిసినా కూడా దానిని ఇంత తొందరగా ప్రకటిస్తారని ఎవ్వరూ ఊహించలేదు. నవంబర్‌ 5న ప్రారంభం కానున్న ఈ చిత్రం జనవరి నుండి సెట్స్‌పైకి వెళ్లనుంది. కాగా ఈ చిత్రం అనౌన్స్‌మెంట్‌ తర్వాత ఈ చిత్రంపై సోషల్‌ మీడియాలో ఒక్కటే ప్రశ్నలు, సమాధానాలు. ఈ చిత్రంలో ఫలానా హీరోయిన్‌ నటిస్తోందని, ఈ చిత్రానికి 'దేవుడే దిగి వచ్చినా' అనేది టైటిల్‌ అంటూ ఒక్కటే రచ్చ. కానీ అఫిషియల్‌ న్యూస్‌ ప్రకారం ఈ చిత్రం హీరోయిన్‌ గానీ, టైటిల్‌ గానీ ఇప్పటికీ నిర్ణయించలేదు. దానికి చాలా కాలం పడుతుందని, మొదట స్క్రిప్ట్‌ వర్క్‌ పూర్తికానిదే ఈ విషయంపై నోరు విప్పవద్దని యూనిట్‌కు కూడా హెచ్చరికలు జారీ అయ్యాయని సమాచారం. దీంతో ఈ రూమర్లకు ఒక్కసారిగా చెక్‌ పడింది. మరి ఈ విషయాలన్నీ అఫీషియల్‌గా వినాలనుకుంటే జనవరి వరకు వెయిట్‌ చేయకతప్పదు. 

Advertisement
CJ Advs
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs