ఆంధ్రా ఒరిస్సా బోర్డర్ లో నక్సలైట్లకు పోలీకులకు మధ్య భారీ ఎన్ కౌంటర్ జరిగిన విషయం తెలిసిందే. ఆ ఎన్ కౌంటర్ లో దాదాపు 31 మంది నక్సలైట్లు ప్రాణాలు కోల్పోయారు. అందులో ప్రముఖ వ్యక్తులు కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే తాజాగా ఈ విషయంపై మావోయిష్ట్ పార్టీ అధికార ప్రతినిధి శ్యామ్ తీవ్రంగా స్పందించాడు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తేనె పూసిన కత్తిలాంటివాడని, ఆయన అంతకంతకు అనుభవిస్తాడని శ్యామ్ తెలిపాడు. ఇంకా మావోయిష్టులు కూడా ఓ లేఖ ద్వారా తమ కోపాన్ని తెలియజేశారు. చంద్రబాబు, లోకేష్ లు తమ నుండి తప్పించుకోలేరని, ఎంత మంది మిలిటరీ, పోలీసులు రక్షణగా ఉన్నప్పటికీ వారి కుటుంబంపై ఆత్మహుతి దాడికైనా పాల్పడేందుకు సిద్ధంగా ఉన్నట్లు మావోయిష్టులువెల్లడించారు.
ఇంకా మావోయిష్ట్ పార్టీ అధికార ప్రతినిధి శ్యామ్ మాట్లాడుతూ.. ఆంధ్రా ఒరిస్సా సరిహద్దుల్లో జరిగింది బూటకపు ఎన్కౌంటర్ అంటూ అభివర్ణించాడు. కోవర్టుల ద్వారా అన్నంలో విషం కలిపించి, పడిపోయి ఉన్నవారిపై విచక్షణా రహితంగా కాల్పులు జరిపారని ఆయన తెలిపాడు. ఇంకా ప్రభుత్వం తమపై ఎన్ని రకాలుగా దాడులు జరిపినా తట్టుకొని నిలబడతామని శ్యామ్ వెల్లడించాడు. కాగా ఇప్పటి ప్రభుత్వాలు విదేశీయులకు అధిక ప్రాధాన్యం ఇస్తూ, ఉద్యమకారులను దేశద్రోహులుగా చిత్రీకరిస్తుందని ఆయన మండిపడ్డాడు. అయితే ప్రస్తుతం ప్రభుత్వాలు ప్రజాస్వామ్యం ముసుగులో హత్యలు చేస్తూ వాటిని ఎన్కౌంటర్ కింద లెక్కకడుతున్నారని శ్యామ్ తీవ్రంగా ఆరోపించాడు.
Advertisement
CJ Advs