బుల్లితెరపై తన బుడిబుడి మాటలతో వయ్యారాలు విరజిమ్మే ముద్దుగుమ్మ అనసూయ. ఆమె బుల్లితెర నుండి వెండితెరకు కూడా గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. కాగా తొలిసారిగా ఆమెకి పవన్‌కళ్యాణ్ అత్తారింటికి దారేది చిత్రంలో ఐటెమ్ పాట చేసే అవకాశమొచ్చినా అందుకు నో చెప్పి అంతటి అవకాశాన్ని అనసూయ వదులుకుందా? అంటూ అందరినీ ఆశ్చర్యపరచింది. అందులో ఆ పాటకు ఎందుకు చేయలేదో అనే విషయంపై తర్వాత క్లారిటీ ఇచ్చింది అనసూయ. ఆ తర్వాత కూడా ఐటెమ్ పాట కోసం ఆమెకు చాలా ఆఫర్లు వచ్చాయి కానీ, వచ్చిన అన్నింటికీ ఒప్పుకోకుండా పొందికగా చేసుకుంటా, ఆ చేసిన వాటి ద్వారా మంచి పాపులారిటీని సంపాదించుకుంటున్న విషయం తెలిసిందే. అలాగ.. క్షణం, సోగ్గాడే చిన్నినాయనా వంటి చిత్రాల్లో అనసూయ నటించింది. ఆ రెండు చిత్రాల ద్వారా ఆమె మంచి పేరే తెచ్చుకుంది. దాంతో అనసూయ రేంజ్ మారిపోయింది. మంచి అందాలొలికే హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది.
అలా తనదైన అందాలతో కుర్రకారును కిర్రెక్కిస్తున్న అనసూయ తాజాగా మరో ఐటెమ్ సాంగ్ కు ఓకే చెప్పినట్లుగా టాక్ నడుస్తుంది. అయితే ఈసారి ఆమె ఐటెమ్ సాంగ్ చేస్తోంది మెగా హీరో అయిన సాయిధరమ్ తేజ్ చిత్రంలో. గోపీచంద్ మలినేని దర్శకడుగా సాయి ధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న విన్నర్ చిత్రానికి గాను అనసూయను ఐటెమ్ సాంగ్ కు ఎంపిక చేసినట్లు తెలుస్తుంది. అయితే అందిన సమాచారాన్ని బట్టి విన్నర్ చిత్రంలో పాట కోసం అనసూయ ముందుగానే పెద్దమొత్తంలో పారితోషికం కూడా ఇవ్వబోతున్నట్లు పరిశ్రమ వర్గాల టాక్. కాగా సోగ్గాడే చిన్నినాయనా.. అన్న ఇరగదీసన అనసూయ విన్నర్ లో కుర్రకారును ఏ విధంగా విజుల్ వేయిస్తుందో చూడాలి.