ఎన్టీఆర్ ఎప్పుడూ హిట్ డైరెక్టర్ తో సినిమా చెయ్యడానికే తహతహలాడతాడనే అపవాదు వుంది. ఏదైనా ఒక సినిమా హిట్ అయిందంటే ఆ డైరెక్టర్ తో సినిమా చెయ్యడానికి రెడీ అవుతాడని పేరుంది. ఇంతకుముందు అయితే ఎన్టీఆర్ ముందు చెప్పిన విధంగానే చేసేవాడు. కానీ ఈ మధ్యన తన రూట్ మార్చుకుని ప్లాప్ డైరెక్టర్స్ తో జత కట్టి హిట్ ట్రాక్ ఎక్కాడు. మొదట పూరి జగన్నాథ్ తో 'టెంపర్' తీసి హిట్ కొట్టిన ఎన్టీఆర్ తర్వాత '1' సినిమాతో ప్లాప్ లో వున్న సుకుమార్ తో 'నాన్నకు ప్రేమతో' తీసి సూపర్ హిట్ కొట్టాడు. ఇక మళ్ళీ కొంచెం స్టైల్ మార్చి 'శ్రీమంతుడు'తో హిట్ కొట్టిన కొరటాలతో 'జనతా గ్యారేజ్' చేసాడు. ఆ సినిమా కూడా సూపర్ హిట్ అయ్యింది. ఇక ఇప్పుడు ఎవరితో సినిమా చేస్తాడా అని అందరూ తెగ ఎదురు చూస్తున్నారు. కానీ ఎన్టీఆర్ మాత్రం ప్రస్తుతం ఏం చెప్పకుండా సస్పెన్స్ మెయింటేన్ చేస్తున్నాడు.
అయితే ఎన్టీఆర్.. పూరితో సినిమా చేస్తాడని వార్తలొస్తున్నప్పటికీ అధికారిక ప్రకటన మాత్రం ఇప్పటిదాకా రాలేదు. మరి 'ఇజం' సినిమా అనుకున్నంత హిట్ అయితే అవ్వలేదు. మరి ఈ రిజల్ట్ చూసిన ఎన్టీఆర్ మళ్ళీ ఆలోచనలో పడినట్లు సమాచారం. అలాగే పూరి మహేష్ మీద, చిరు మీద ఇండైరెక్ట్ గా కామెంట్ చెయ్యడం కూడా ఎన్టీఆర్ కి పెద్దగా నచ్చలేదని... అందుకే పూరీని పక్కన పెట్టేందుకు ఎన్టీఆర్ రెడీ అయ్యాడని అంటున్నారు. ఇక ఎన్టీఆర్ చూపు ఇప్పుడు మరో హిట్ డైరెక్టర్ మీద పడినట్లు టాక్. అతనెవరంటే 'ప్రేమమ్' సినిమాతో హిట్ కొట్టిన చందూ మొండేటి పై పడిందట. నాగ చైతన్యకు బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చి దసరా హీరోని చేసిన చందూ మొండేటి తో సినిమా చెయ్యాలని ఎన్టీఆర్ భావిస్తున్నట్లు ఫిలిం నగర్ సర్కిల్స్ లో వినబడుతున్న న్యూస్. మరి వీరి కాంబినేషన్ సినిమా ఉంటుందో లేదో గానీ ప్రచారం మాత్రం మంచి జోరుగా సాగుతుంది. చూద్దాం ఎన్టీఆర్ తన నెక్స్ట్ సినిమా ఎవరితో చేస్తాడో...!?