చంద్రబాబు ఏదైనా ఆలోచించే నిర్ణయం తీసుకుంటాడు. ఆయన్ని హైటెక్ ముఖ్యమంత్రిగా అందరూ అంటూ వుంటారు. చంద్రబాబు ఏదోలా తన కొడుకుని రాజకీయ వారసుడిగా చెయ్యాలని కష్టపడుతున్నాడు. లోకేష్ కి పెద్దగా రాజకీయాల మీద పట్టు లేకపోయినా అలా అలా రాజకీయ పరిజ్ఞానాన్ని పెంచుకుని ఇప్పుడు మంత్రి పదవి పొందడం కోసం ఆరాటపడుతున్నాడు. తన తండ్రి అపర చాణిక్యుడు గనక లోకేష్ కి రాజకీయాల్లో ఎదురు లేదుగాని లోకేష్ ఏమంత పట్టున్న రాజకీయ నాయకుడు కాదు. తండ్రి చాటున రాజకీయాల్లో మనుగడ సాగిస్తున్నాడు గాని లేకపోతెే ఎప్పుడో రాజకీయాలకు పేకప్ చెప్పేసేవాడు. అయితే తన కొడుకుని రాజకీయాల్లో నిలబెట్టినట్లే ఇప్పుడు తన కోడల్ని కూడా రాజకీయాల్లో దించడానికి చంద్రబాబు పావులు కదుపుతున్నట్లు సమాచారం.
తన కోడలు, లోకేష్ భార్య అయిన బ్రాహ్మిణిని రాజకీయాల్లోకి దించాలని బాబు భావిస్తున్నాడట. వచ్చే ఎన్నికల్లో బ్రాహ్మణిని పోటీ చేయించాలని చూస్తున్నాడట. ఇప్పటికే దీనిపై బాలకృష్ణతో సంప్రదించినట్లు, అలాగే కుటుంబ సభ్యులతో చర్చలు జరిపినట్లు కూడా వార్తలొస్తున్నాయి. ఇక బాలకృష్ణతో సహా కుటుంబ సభ్యులు కూడా బ్రాహ్మణి ఎన్నికల్లో పోటీ చేసేందుకు సుముఖత చూపినట్లు సమాచారం. ఇక బ్రాహ్మణిని లోక్ సభకి పంపించాలని బాబు ప్లాన్ చేస్తున్నాడట. గుంటూరు లోక్ సభ స్థానం నుండైనా లేక హిందూపురం లోక్ సభ స్థానం నుండైనా ఆమెని పోటీకి దింపాలని బాబు భావిస్తున్నాడట.
ఇప్పటికే బ్రాహ్మణి బిజినెస్ లో రాణిస్తుండగా ఇప్పుడు రాజకీయాల్లో కూడా ఆమె రాణించగలదని నమ్మి చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నాడట. అందుకే ఆమెని ఎలాగైనా ఎంపీ పదవికి పోటీ చేయించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాడు. తాత ఎన్టీఆర్ ఆశీస్సులు, తండ్రి బాలయ్య క్రేజ్, మామ పలుకుబడి, భర్త సపోర్ట్ తో బ్రాహ్మణి కూడా ఏపీ రాజకీయాలను శాసించడానికి రెడీ అయ్యిందనే వార్తలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.చంద్రబాబు మాత్రం ఏపీలో తన కుటుంబాన్ని అన్ని విధాలా రాజకీయాల్లో నిలబెట్టాలని తెగ ఆరాటపడుతున్నాడని ఇది చూస్తుంటే అర్ధమవుతుంది.
Advertisement
CJ Advs