Advertisement
Google Ads BL

'గౌతమీపుత్ర..' పై ఎన్టీఆర్ ఎంక్వైరీ లేంటి..?


నందమూరి ఫ్యామిలిలో జూనియర్ ఎన్టీఆర్ ని కలవనివ్వకపోవడంతో ఎన్టీఆర్ నందమూరి ఫ్యామిలీకి దూరంగా ఉంటున్నాడు. ఇక ఎన్టీఆర్ తన తండ్రి హరికృష్ణ మరియు తన అన్న కళ్యాణ్ రామ్ లతో మాత్రమే సన్నిహిత సంబందాలు కొనసాగిస్తున్నాడు. ఇక బాబాయ్ బాలకృష్ణ తో ప్రత్యక్ష గొడవలైతే లేవుగాని పరోక్షంగా వీరిరువురికి పడడం లేదని పబ్లిక్ అందరికి తెలుసు. ఇక నందమూరి ఫాన్స్, ఎన్టీఆర్ ఫాన్స్ అంటూ ఫాన్స్ కూడా విడిపోయారు. అసలు బాలకృష్ణకి ఎన్టీఆర్ అంటే పొసగదని అందరికి తెలుసు. ఇక  ఎన్టీఆర్ కూడా మనకెందుకులే అని సైలెంట్ గా వుంటున్నాడు.

Advertisement
CJ Advs

చాలాకాలం నుండి సైలెంటుగా తన పని తాను చేసుకు పోతున్నఎన్టీఆర్ కి  ఈ మధ్యన బాబాయ్ బాలకృష్ణ గురించి ధ్యాస ఎక్కువైనట్లుంది. ఆ మధ్యన 'గౌతమీపుత్ర శాతకర్ణి' ఫస్ట్ లుక్ లో బాలకృష్ణ లుక్ ని చూసిన ఎన్టీఆర్ ఈ సినిమా బాబాయ్ తప్ప ఎవరూ చెయ్యలేరని అన్నట్లు వార్తలొచ్చాయి. మరి బాలయ్యని పొగడడంలో ఎన్టీఆర్ ఆంతర్యమేమిటో తెలియదు గాని... ఇప్పుడు వీరి గురించి మరో వార్త ఫిలింనగర్ సర్కిల్స్ లో హల్ చల్ చేస్తుంది. అదేమిటంటే గౌతమిపుత్రని తెరకెక్కిస్తున్న డైరెక్టర్ క్రిష్ కి ఎన్టీఆర్ ఫోన్ చేసాడని అంటున్నారు. 'గౌతమీపుత్ర శాతకర్ణి'కి సంబంధించి ఏదైనా ఒక ఫ్రెష్ వీడియో చూడాలని క్రిష్ ని ఎన్టీఆర్ కోరాడట. అసలు ఎన్టీఆర్ ఫోన్ చెయ్యడమే క్రిష్ కి షాక్ ఇస్తే ఈ గౌతమీపుత్ర  వీడియో చూడాలనుకోవడంతో ఇంకా పెద్ద షాక్ అయ్యాడట. ఇక బాలయ్య 100 చిత్రం గురించి అనేక విషయాలు డైరెక్టర్ క్రిష్.. ఎన్టీఆర్ ముచ్చటించుకున్నారని సమాచారం. అయితే క్రిష్ ఎప్పుడు కావాలంటే అప్పుడు 'గౌతమీపుత్ర శాతకర్ణి' స్పెషల్  వీడియోస్ చూడవచ్చని ఎన్టీఆర్ తో క్రిష్ చెప్పినట్లు వార్తలొస్తున్నాయి. 

మరి ఎన్టీఆర్ కి బాబాయ్ 100 చిత్రం గురించి ఇంత ఇంట్రెస్ట్ ఎందుకు పుట్టిందో గాని బాలయ్య 100 చిత్రం 'గౌతమీపుత్ర శాతకర్ణి' ఫస్ట్ లుక్ టీజర్ మాత్రం అద్భుతమైన రెస్పాన్స్ ని రాబట్టుకుంది. ఇక ఈ టీజర్ తో సినిమా పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమాని వచ్చే సంక్రాంతికి  విడుదల చెయ్యడానికి ఆ చిత్ర యూనిట్ శత విధాలా కృషి చేస్తుంది. ఇక ఎప్పుడెప్పుడు తమ అభిమాన హీరో డైలాగ్స్ విందామా అని నందమూరి ఫాన్స్ కూడా వెయిట్ చేస్తున్నారు.

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs