ఒక హీరోయిన్ వి వెంట వెంటనే విడుదలైన మూడు భారీ బడ్జెట్ చిత్రాలు డిజాస్టర్స్‌గా నిలిస్తే... ఇక మన టాలీవుడ్‌లో దర్శకనిర్మాతలు, హీరోలు ఆమెను మరలా తమ చిత్రాల్లో పెట్టుకోవాలంటే భయపడతారు. 'సర్దార్ గబ్బర్‌సింగ్, బ్రహ్మోత్సవం, దో లఫ్జోంగి కహాని' చిత్రాలు వరసగా డిజాస్టర్స్‌గా నిలిచాయి. దాంతో టాలీవుడ్ సినీ విమర్శకులు కాజల్‌కు రిటైర్‌మెంట్ అయ్యే సమయం వచ్చిందని, ఇక ఆమెకు తెలుగులో అవకాశాలు ఉండవని భావించారు. కానీ వారి అంచనాలకు ధీటుగా ఇప్పుడు కాజల్ తాను మాయలేడీ అని నిరూపించుకుంటుంది. 'జనతాగ్యారేజ్' చిత్రంలో ఐటం సాంగ్ చేసిన చిత్రం బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఇక ప్రస్తుతం ఆమె మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న 150వ చిత్రం 'ఖైదీ నెంబర్ 150'లో హీరోయిన్‌గా నటిస్తోంది. మరో పక్క రానా-తేజల కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రంలో నటిస్తోంది. ఒకేసారి సీనియర్లు, జూనియర్లు అనే తేడా లేకుండా అవకాశాలను పొందుతూ విశ్లేషకుల అంచనాలను తల్లకిందులు చేసిన కాజల్ నిజంగానే ఏదో మాయ చేస్తున్నట్లు వుంది కదా!