Advertisement
Google Ads BL

పవన్ పోరాటం ఆగలేదు..!


జనసేన పార్టీ అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక హోదాకోసం పోరాడతానని గతంలో జరిపిన సభల సాక్షిగా ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే గతంలో జరిగిన సాధారణ ఎన్నికల సమయంలో భాజపాతో సహా అన్ని పార్టీలు తాము అధికారంలోకి వస్తే ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని మాట ఇచ్చిన విషయం తెలిసిందే. అదే విధంగా  కేంద్రంలో భాజపా అధికారంలోకి వచ్చినా ఆ తర్వాత ఏపీకి ప్రత్యేక హోదాకి బదులుగా ప్రత్యేక ప్యాకేజీ అంటూ ప్రకటించిన విషయం కూడా తెలిసిందే. కాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ తరఫు నుండి ప్రత్యేక హోదాకోసం ఉద్యమిస్తానంటూ తిరుపతి, కాకినాడ బహిరంగ సభల సాక్షిగా కార్యాచరణను ప్రకటించిన విషయం తెలిసిందే. ఉన్నట్టుండి ప్రత్యేక హోదాపై ఒక్కసారిగా పవన్ ఉద్యమంలోకి దుమకటంతో కేంద్రానికి ఏం చేయాలో తోచక హడావుడిగా ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించేసింది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్ళి 2019 నాటికి పూర్తిస్థాయి రాజకీయాల్లోకి దిగి అన్ని నియోజక వర్గాల నుండి పోటీ చేసే దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తుంది. ఆ రకంగా ఆయన అడుగులు చాలా త్వరిత గతిన పడుతున్నాయి. అందులో భాగంగానే జనసేన పార్టీ తరఫున ఫాస్ట్ పాస్ట్ గా సభలు, సోషల్ మీడియాలోకి వెళ్ళడం వంటివి అత్యంత త్వరగా జరుగుతున్న పరిణామాలనే చెప్పవచ్చు. కాకినాడ సభలో పవన్ మాట్లాడుతూ ప్రత్యేక హోదాపై ఆంధ్రరాష్ట్రమంతా పర్యటిస్తానని, ఆ దిశగా ప్రజలందరిలో చైతన్యం కల్పిస్తానని పవన్ వెల్లడించాడు. అందులో భాగంగానే ముచ్చటగా మూడో సభను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్  అనంతపురంలో జరపాలనుకుంటున్నట్లు తెలుస్తుంది. కాగా తాజాగా అందిన సమాచారాన్ని బట్టి  నవంబర్ 10వ తేదీన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాక్షన్ రాజకీయాలకు కొలువైన అనంతపురంలో సభను పెట్టేందుకు సర్వం సిద్ధం చేసుకుంటున్నట్లుగా తెలుస్తుంది. జనసేన పార్టీని రాయలసీమ ప్రాంత ప్రజల్లోకి తీసుకెల్లాలని పవన్ భావిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించకపోయినా అనధికారికంగా మాత్రం మీడియా కోడై కూస్తుంది.

Advertisement
CJ Advs
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs