తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత దాదాపు నెలరోజుల నుండి అనారోగ్యం కారణంగా అపోలో ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ మధ్య కాలంలో ఆమె ఆరోగ్యం విషయంపై పలురకాలుగా వదంతులు వచ్చినప్పటికీ తాజాగా ఆమె కోలుకుంటున్నట్లుగా వార్తలు బయటకు వస్తున్నాయి. అన్నాడీయంకెకు చెందిన నేతలు కూడా అమ్మ వారం పదిరోజుల్లో ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అవుతారన్న అభిప్రాయాన్ని వెల్లడి చేస్తున్నారు.
జయలలితకు మెరుగైన చికిత్సను అందించే నిమిత్తం లండన్ నుంచి వచ్చిన డాక్టర్ రిచర్డ్, ఎయిమ్స్ వైద్యబృందం పర్యవేక్షణలో అమ్మకు ట్రీట్ మెంట్ నడుస్తుంది. ఈ సందర్భంగా మరో పది రోజులు ఆసుపత్రి నుంచే జయలలిత చికిత్స కొనసాగిస్తే అమ్మ ఆరోగ్యం మరింత మెరుగౌతుందని లండన్ వైద్యుడు రిచర్డ్ సూచించినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. అదే విధంగా అన్నాడియంకె నేతలు కూడా వచ్చే ఆదివారం దీపావళి సందర్భంగా జయలలిత ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లుగానే వివరిస్తున్నారు.
తాజాగా సినీనటి ఖుష్బూ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అమ్మను కలిసింది. ముఖ్యంగా ఆమె..జయలలిత చికిత్స పొందుతున్న తీరును అక్కడి వైద్యలను అడిగి తెలుసుకుంది. ఖుష్భూ ట్విట్టర్ ద్వాారా స్పందిస్తూ... తాను స్వయంగా అపోలో ఆసుపత్రికి వెళ్ళి జయలలితను చూసినట్లుగా వెల్లడించింది. ఈ సందర్భంగా జయలలిత ఆరోగ్యం మెరుగుపడుతుందని, త్వరగా అమ్మ కోలుకొని దీపావళి నాటికి ఆసుపత్రి నుండి బయటకు వచ్చి తమిళ ప్రజలతో దీపావళి జరుపుకోవాలని కోరుకుంటున్నట్లు ఖుష్భూ వెల్లడించింది.
Advertisement
CJ Advs