నదియా తాజాగా ఓ లెస్బియన్ చుట్టూతా తిరిగే కథ ఆధారంగా తీసిన సినిమాలో నటించింది. నదియా నటించిన ‘తిరైక్కు వరాదా కథై’పేరుతో తమిళంలో రూపొందిన ఈ సినిమాకు తులసి దాస్ దర్శకత్వం వహించాడు. అందరూ మహిళలతో ఈ చిత్రాన్ని రూపొందించారు. కాగా ఈ సినిమా గురించి నదియా మాట్లాడుతూ.. ఓ మర్డర్, మిస్టరీకి చెందిన కథ ఆధారంగా ఈ సినిమా రూపొందించడం జరిగిందని వెల్లడించింది. ఇంకా ఇదో క్రైం కథ, ఇందులో తన పాత్ర బాగా నచ్చింది కాబట్టే ఈ చిత్రంలో నటించానన్నది. ఓ పోలీస్ అధికారిగా మర్డర్ సంఘటనకు సంబందించిన నిందితులను పట్టుకునే క్రమంగా ఇటువంటి తరహాకు ప్రాధాన్యం కలిగిన పాత్రతో ఈ సినిమాలో నటిస్తున్నానని వెల్లడించింది నదియా. ఇంకా నదియా వెల్లడిస్తూ తనకు డబ్బు కన్నా కూడా మంచి పాత్రే ప్రధానం అంటూ చెప్పింది.
అయితే ఈ మధ్య కాలంలో ఇటువంటి పాత్రలు చేయడానికి హీరోయిన్లెవరూ ముందుకు రారన్న విషయం తెలిసిందే. అలాంటి ఒకానొక కాలంలో, సందర్భంలో ఉన్న సమయంలో ఓ లెస్బియన్ సినిమాలో నటించి సంచలనం రేపింది నదియా? ప్రస్తుతం కోలీవుడ్ అంతా ఈ న్యూస్ సంచలనం రేపుతోంది? నదియా ఏంటి ఇలాంటి సినిమాలు చేయడం ఏంటి? ప్రజలంతా షాక్ తింటున్నారు. మొత్తానికి ఇలాంటి పాత్రలు పోషించినందుకు నదియా ఎలాంటి విమర్శలు ఎదుర్కొంటుందో వేచి చూడాలి.