ఏ విధంగానైనా సినిమాల్లోకి రావడం అంటే అంత ఆషామాషీ వ్యవహారం కాదు. దానికి అవకాశాలు, అదృష్టాలు కలిసి రావాలి. నిజంగా నైపుణ్యం ఉన్న వ్యక్తులు సినిమాల్లోకి రావడం ఒక ఎత్తయితే, వచ్చి ఇందులో నిలదొక్కుకోవడం కూడా గగణం వంటిందే. సినిమా అనేది ఒక జూదం వంటిది. సినిమాతో కూడిన వ్యవహారాలు ఎప్పుడూ ఒకేలా ఉండవు. సినిమాతో ముడిపడిన జీవితాలు కొందరికి ఆకాశపు అంచులు చూపిస్తే మరికొందరికి పాతాళానికి పడగొడుతుంది. అందుకే ఎవరైనా సినిమాల్లోకి వెళ్తున్నామంటే ఒకటికి రెండుమార్లు ఆలోచించుకోమని చెప్తుంటారు అనుభవం గడించిన విజ్ఞులు.
అయితే బాలీవుడ్ అగ్రహీరో అయిన అమీర్ ఖాన్ కు తన సినీ జీవితం ఆరంభ సందర్భంలో ఇలాంటి ఘటనే ఒకటి జరిగిందని వెల్లడించాడు. మొదట తాను సినిమాల్లోకి వెళ్తానంటే తన తల్లి దండ్రులు అడ్డుకొన్నారంటూ ఆనాడు జరిగిన సందర్భాన్ని గుర్తు చేసుకున్నాడు. కాగా తనను ఇంట్లో వారంతా ఇంజనీర్ గా చూడాలనుకున్నారని, కానీ తన తండ్రి సినీ పరిశ్రమలో ఒక గొప్ప దర్శకుడు కావడంతో తన ఇంట్లో ఎప్పుడూ సినీ వాతావరణమే ఉండేదని అమీర్ ఖాన్ వివరించాడు. అయితే అప్పట్లోనే తాను సినిమా విషయంలో తండ్రిపై ఆధారపడకూడదని నిర్ణయించుకున్నట్లు అమీర్ ఖాన్ తన సినీ పరిశ్రమ తొలి రోజులను గుర్తుచేసుకున్నాడు.