మొదట్లో పవర్ స్టార్ పవన్ కి, దర్శకుడు పూరీకి విడదీయరాని అవినాభావ సంబంధం ఉండేది. ఆ తర్వాత అది మెల్లిమెల్లిగా ఇరువురి మధ్య ఏర్పడ్డ ఇగో కారణంగా తగ్గుతూ వచ్చింది. బద్రి సినిమాతో పూరికి దర్శకత్వంలో అవకాశం ఇచ్చాడు పవన్. దర్శకుడిగా అయితే అవకాశం ఇచ్చాడు కానీ ఆ తర్వాత సినిమాలో చాలా భాగం పవనే దగ్గరుండి అన్నీ చక్కా చూసుకున్నాడు. అలా హీరో, దర్శకుడి పనులన్నీ కెలుకుతుండటంతో పూరి ఏమనుకున్నాడో ఏమోగానీ ఆసినిమా విడుదలై మంచి విజయవంతం కావడంతో అంతగా పట్టించుకోలేదు పూరి. ఆ తర్వాత మళ్ళీ పూరి, పవన్ కు పోకిరి సినిమా కథ వినిపిస్తే ఆయనగారికి అది అంతగా నచ్చలేదు. అయితే తర్వాత చాలా కాలానికి వీరిద్దరి కాంబినేషన్ లో కెమేరా మేన్ గంగతో రాంబాబు సినిమా ఓకే అయింది. ఈ సినిమా మేకింగ్ లో కూడా పవన్ ఏలెడుతుండటం, అసలే స్టార్ హీరో, స్టార్ డైరెక్టర్ హోదా. ఎందుకు తగ్గుతారు ఇద్దరూ తగ్గలేదు. అలా ఎన్ని మనస్పర్థలు వచ్చినా బయటికి బాగానే ఉన్నా, లోన మాత్రం గంభీరత ఇద్దరిలో కొనసాగింది. ఆ తర్వాత పవన్ లక్ష్యంగా పూరి జగన్నాథ్ ‘కమేరా మేన్ గంగతో రాంబాబు సినిమాలో పవన్ కళ్యాణ్ రంభలా ఉన్నాడంటూ కామెంట్లు చేయించేలా పాత్రను సృష్టించాడు. అయితే తాజాగా ఇజం సినిమాలో కూడా విలన్ అయిన జావేద్ ఇబ్రహీంతో రాసుకు పూసుకు తిరుగుతూ ఉండేలా, వాడికి ఎప్పుడూ సహాయం చేస్తూ ఉండే నీచమైన కామెడీని పండించే రాజకీయ నాయకుడి పాత్ర ఇందులో ఉంది. ఆ పాత్రని పోసాని కృష్ణమురళి అద్భుతంగా పోషించాడు. పోసాని కృష్ణమురళి తన తోటి రాజకీయ నాయకులతో కలిసినప్పుడు, మీడియాతో ఉన్న సన్నివేశాల్లోనూ, బ్యాక్ గ్రౌండ్‌లో పోసాని పార్టీ సింబల్ కనిపిస్తుంది. అది ఎలా ఉంటుందంటే పవన్ జనసేన పార్టీ గుర్తులా దర్శనమిస్తుంది. అంటే దానికి దగ్గరి పోలికలతో ఉంటుంది. మరి ఈ మాత్రం గుర్తొచ్చేలా చేసిన పూరి, పవన్ పార్టీ అయిన జనసేనను కెలికుతున్నాడనే భావన ప్రేక్షకులకు సహజంగా కలుగుతుంది. మొత్తానికి పవన్ పై ఉన్న కసిని పూరి ఇలా పరోక్షంగా తీర్చేసుకుంటున్నాడన్న మాట.