ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు రోజురోజుకూ చాలా చురుకుగా మారిపోతున్నాయి. రాబోవు ఎన్నికల కోసం ఇప్పటి నుండే ప్రధాన పార్టీలైన తెదేపా, వైకాపాలు ఎవరి స్కెచ్ ప్రకారం వాళ్ళు దూసుకుపోతున్నారు. రాబోయే ఎన్నికల్లో ఏ విధంగానైనా అధికారాన్ని చేపట్టాలన్న భావంతో వైకాపా, మళ్ళీ తమదే అధికారం అంటూ తెదేపా పోటాపోటీగా తమదైన శైలిలో రాజకీయ సర్వేలు నిర్వహించుకుంటూ ఆ రకంగా ముందుకు పోతున్నారు. అయితే తాజాగా తెలుస్తున్న విషయం ఏంటంటే అధికారంలో ఉన్న తెదేపా, వైకాపాలో గ్రామస్థాయిల్లో ఉన్న బలమైన నాయకులపై కన్నేసినట్లుగా తెలుస్తుంది. వైకాపాకి సైన్యంగా, అన్నిదిసెలా వెన్నుదన్నుగా నిలిచే బలమైన బలగాలపై తెదేపా గురిపెట్టినట్లు తాజాగా అందిన సమాచారాన్ని బట్టి తెలుస్తున్న అంశం. ఆ రకంగా వైకాపా అధినేత జగన్ కు సొంత పార్టీ నుండి వలసల బెడదను ఇంకా ఎదుర్కొంటూనే ఉన్నాడు. జగన్ ఓ పక్క ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూ.. చాలా బిజీగా ఉన్న సమయంలో చంద్రబాబు తన స్కెచ్ ద్వారా గ్రామ, మండల స్థాయిల్లోని పలు కీలకమైన వైసిపి నేతలను టిడిపిలోకి లాగేసుకొనేందుకు ప్రయత్నాలు ముమ్మరంగా జరుపుతున్నాడు. కాగా జగన్ ప్రజా సమస్యలపై ఎంతలా పోరాడినప్పటికీ, పార్టీకి బలమైన బలగాలుగా చెప్పుకొనే బలమైన గ్రామస్థాయి నేతలు లేకపోతే ఎంత చేసినా నిరర్థకమే. పార్టీని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ప్రతి ఊళ్ళోనూ స్థానికంగా బలమైన నాయకుడు తప్పకుండా ఉండాలి. ఆ దిశగా పార్టీ పటిష్టమైన కృషి జరపాలి. పార్టీకి బలమైన నాయకులు స్థానికంగా లేనంతకాలం, పార్టీ పరిస్థితి చాలా సాదాసీదాగానే ఉంటుంది. ఇలా వైకాపా రెక్కలు పూర్తిగా తెంచే దిశగా చంద్రబాబు పథకం ప్రాకారం పునాదులనే నరక్కొస్తున్నట్లుగా తెలుస్తుంది. వైకాపా అధినేత ఇంకా ఏమరుపాటుతనంతో ఉంటే ఈ సారి కూడా పార్టీ ఇప్పటి ఈ స్థానంలోనే ఉంటుందన్నది రాజకీయ విశ్లేషకుల భావన.