దీపికా కోసం స్పెషల్ గా వదిలారు..!


బాలీవుడ్‌లో నెంబర్‌వన్‌ స్టార్‌ హీరోయిన్‌గా ఆధిపత్యం చలాయిస్తున్న దీపికా పదుకొనే ప్రస్తుతం 'ట్రిపుల్‌ ఎక్స్‌' అనే హాలీవుడ్‌ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. దీపికా పదుకొనే ద్వారా ఈ చిత్రం ఇండియాలో కూడా భారీ వసూళ్లు సాధిస్తుందనే నమ్మకంతో ఈ చిత్ర యూనిట్‌ ఆశగా ఎదురుచూస్తోంది. ఈ చిత్రం మొదటి ట్రైలర్ లో దీపికా కేవలం కొన్న సెకన్ల పాటు మాత్రమే స్క్రీన్‌పై కనిపించింది. దీంతో ఇండియాలోని సీనీ లవర్స్‌ కాస్త నిరాశపడ్డారు. కానీ ఈ తప్పును సరిదిద్దుకునేందుకు ఈ చిత్రం రెండో ట్రైలర్‌ మొత్తాన్ని దీపికాపైనే వదిలారు. దీంతో ఇండియాలో ఈ కొత్త ట్రైలర్‌ భారీ రెస్పాన్స్‌ను సొంతం చేసుకుంది. ఈ చిత్రంలో దీపికాను పెట్టుకోవడం ద్వారా ఈ చిత్రాన్ని ఇండియాలో బాగా క్యాష్‌ చేసుకొని రికార్డు వసూళ్లు సాదిస్తుందని ట్రేడ్‌ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. మరి దీపికాను హాలీవుడ్‌ చిత్రంలో తీసుకోవడం ఈ చిత్రానికి ప్లస్‌ అవుతుందా? లేదా? అనేది ఇప్పుడు ట్రేడ్‌వర్గాలకు అంచనాలకు అందకుండా ఉంది. 

Show comments


LATEST TELUGU NEWS


LATEST IN NEWS

POPULAR NEWS



LATEST IN GALLERIES

POPULAR GALLERIES