జబర్దస్త్ షో ద్వారా పాపులర్ అయిన యాంకర్ రష్మి గౌతమ్. జబర్దస్త్ షోలో రష్మి వీరలెవల్లో రెచ్చిపోతూ హాట్ హాట్ డ్రస్ లతో యాంకరింగ్ ద్వారా సంచలనం సృష్టిస్తూ కొత్త పోకడలు పోతూ అలా అలా సినిమా అవకాశాలను దక్కించుకుంటా మస్త్ హుషారులో ఉంటుందీ ముద్దుగుమ్మ రష్మి. గుంటూర్ టాకీస్ సినిమా ద్వారా రెచ్చిపోయే అందాల ఆరపోతతో వెండితెర ప్రేక్షకులను మరింత దగ్గరయింది రష్మి. అంతే కాకుండా మరో పాపులర్ షోలో సుధీర్, రష్మి కలిసి జంటగా ఛాలంజ్ అంటూ ఓ ఊపు ఊపుతుంది రష్మి.
కాగా తాజాగా రష్మితో తన ఫ్రెండ్స్ కి ఉన్న రిలేషన్ షిప్ పై కొన్ని ఆసక్తికరమైన నిజాలు అనిపించేలా మాటలు పేల్చింది రష్మి. జబర్దస్త్ షో మొదట అనసూయ యాంకర్ గా చేస్తూ మధ్యలో ఏదో విషయంలో తేడా వచ్చి ఆ షో నుండి కొంతకాలం పాటు కాస్త పక్కకు తప్పుకుంది అనసూయ. ఆ ప్లేస్ ను అప్పట్లో రష్మి ఆక్రమించేసింది. అలా అందివచ్చిన అవకాశాన్ని ఓ జీవిత ప్రయాణంగా భావించిన రష్మి ఆ షో ద్వారా మరింత పాపులారిటీని సంపాదించిందనే చెప్పాలి. ఈ విషయాలపై తాజాగా రష్మి స్పందిస్తూ.. అనసూయకు తనకు గొడవలు రూమర్లు క్రియేట్ అయినవి, అందులో ఏమాత్రం నిజం లేదు, తామిద్దరం మంచి ఫ్రెండ్స్ అంటూ వెల్లడించింది. ఇంకా సుధీర్ కు తనకు ఉన్న రిలేషన్ షిప్ పై కూడా ఘాటు ఘాటుగా యూట్యూబ్ ల ద్వారా, ఇంటర్నెట్ ద్వారా అదే పనిగా పలు రకాల ఊహాగానాలు చెలరేగినవి, కానీ అలాంటి రూమర్లు ద్వారా తనకు ఎలాంటి అభ్యంతరం లేదని, ఈ ఫీల్డ్ లో అవన్నీ చాలా సాధారణమే అని, అటువంటివి ఓ రకంగా తమకు పాపులారిటీని కూడా తెచ్చి పెడతాయని వెల్లడించింది రష్మి. ఫైనల్ గా రష్మి ఈ రూమర్లపై ఎలా స్పందించిందంటే మీరు ఎలాగైనా నిరభ్యంతరకరంగా ఊహించుకోండి, వాటిపై తనకెలాంటి అభ్యంతరం లేదు అని చెప్పేసిందండోయ్.
Advertisement
CJ Advs