మెగా కుటుంబంలో అంతర్గత కుమ్ములాటలు తీవ్రంగా ఉన్నాయంటూ టాలీవుడ్ లో నిరంతరం ప్రచారం జోరుగా సాగుతుంటుంది. ఆ ప్రచారానికి చెక్ పెట్టే దిశగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగాస్టార్ చిరంజీవులు ఇద్దరూ ఎప్పటికప్పుడూ సమాధానాలు చెప్పుకుంటూ వస్తుంటారు. అయితే తాజాగా జరిగిన చిరంజీవి పుట్టిన రోజు వేడుకలకు కూడా పవన్ కళ్యాణ్ దూరంగా ఉన్నాడు. వీటన్నింటిని బట్టి చూస్తే చిరంజీవి, పవన్ కళ్యాణ్ ఇద్దరూ ఇంకా ఎడమెహం పెడమెహంగానే ఉన్నారా అన్న అనుమానం అభిమానుల్లో ఉంది. అయితే గతంలో పవన్ కళ్యాణ్ కూడా ఈ విషయంలో అమ్మదమ్ముల మధ్య కలతలు పెట్టడానికి ప్రయత్నించకండి ప్లీజ్ అంటూ స్పష్టం చేసిన విషయం కూడా తెలిసిందే. తాజాగా అన్నదమ్ముల మధ్య మెగా ఫ్యామిలీ మధ్య కొనసాగుతున్న అనుమానానికి చెక్ పెట్టేందుకు సిద్ధమయ్యాడు రామ్ చరణ్ తేజ్.
రామ్ చరణ్ తేజ్ హీరోగా చేస్తున్న ధ్రువ చిత్రం ఆడియో వేడుక నవంబర్ 20 వ తేదీన జరగనుంది. ఈ వేడుకలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పాల్గొంటాడా లేదా అన్నది మెగా అభిమానులను తొలిచివేస్తున్న ప్రశ్న. అయితే తాజాగా ధ్రువ ఆడియో రిలీజ్ ఫంక్షన్ కు పవన్ కళ్యాణ్ కు ఆహ్వానం పంపించగా పవన్ ఓకే అన్నాడని కూడా అభిమానులు సంబరాలు జరుపుకుంటున్నారు. మెగా ఫ్యామిలీలో అందరూ ఎటువంటి గొడవలు లేకుండా కలిసుండాలని కోరుకుంటారు కదా మరి అభిమానులు. అయితే మొత్తానికి ధ్రువ ఆడియో రిలీజ్ ఫంక్షన్ కు పవన్ కళ్యాణ్ తో పాటు మెగా హీరోలంతా వచ్చే అవకాశాలు ఉన్నట్లు అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తుంది. కాగా ధ్రువ ఆడియో వేడుకలో మెగా కుటుంబమంతా మెరవనున్నదన్న మాట.
Advertisement
CJ Advs